Richard Wolff : అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ సంచలన వ్యాఖ్య, భారత్‌తో పెట్టు కుంటే అమెరికా అంతే సంగతులు
Richard Wolff : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భారత దే శం విషయంలో అమెరికా ప్రపంచా నికే పెద్దన్నలా వ్యవహరిస్తోందని, కానీ ఈ చర్యలతో తన కాలిపై తా నే గొడ్డలివేటు వేసుకుంటోందని ప్ర ముఖ అమెరికన్ ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా విధించిన భారీ సుంకాలను ఆయన తప్పుబట్టారు. అమెరికా తీరు ఒక ఎలుక వెళ్లి ఏనుగును గుద్దినట్టుగా ఉందని ఆయన అభివర్ణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయ డంతో పాటు ఆకట్టుకుంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ అమెరికా అ ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత్‌కు చెందిన పలు ఉత్పత్తులపై టారిఫ్‌ల ను 50 శాతానికి పెంచారు. ఈ నిర్ణ యం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం చే స్తున్న రష్యాకు ఆర్థికంగా నష్టం కలి గించేందుకే ఈ చర్యలు తీసుకున్న ట్లు అమెరికా వెల్లడిస్తోంది.
రష్యా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రిచర్డ్ వోల్ఫ్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…అమెరికా చ ర్యల వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. అమెరికా మార్కెట్ మూసుకుపోతే భారత్ తన ఉత్పత్తులను బ్రిక్స్ దేశాలకు అమ్ముకుంటుంది. గతంలో రష్యా తన ఇంధనాన్ని ఇతర దేశాలకు అ మ్ముకున్నట్లే, భారత్ కూడా ప్రత్యా మ్నాయ మార్గాలను చూసుకుం టుందని విశ్లేషించారు. అమెరికా చ ర్యలు పాశ్చాత్య దేశాలకు ఆర్థిక ప్ర త్యామ్నాయంగా ఎదుగుతున్న బ్రి క్స్ కూటమిని మరింత బలోపేతం చేస్తాయని ఆయన హెచ్చరించారు.
అదే విధంగా ప్రస్తుతం ప్రపంచ ఉ త్పత్తిలో బ్రిక్స్ దేశాల బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజి ప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యూఏఈ వాటా 35 శాతా నికి చేరిందని, అదే సమయంలో జీ 7 దేశాలు కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇ టలీ, జపాన్, యూకే, అమెరికా వా టా 28 శాతానికి పడిపోయిందని వోల్ఫ్ గుర్తుచేశారు.
ఇది ఒక చారిత్రక ఘట్టం. పశ్చిమ దేశాలకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కూటమిని అమెరికాయే దగ్గరుండి పెంచి పోషిస్తోందని ఆయన అన్నా రు.గతంలో ట్రంప్ పలు సందర్భా ల్లో బ్రిక్స్‌ను ఒక చిన్న బృందమని, త్వరలో కనుమరుగైపోతుందని కొ ట్టిపారేశారు. ఉమ్మడి కరెన్సీని తీసు కొస్తే 100 శాతం టారిఫ్‌లు విధిస్తా మని కూడా హెచ్చరించారు. అయి తే, వోల్ఫ్ మాత్రం సోవియట్ కాలం నుంచి భారత్, రష్యాల మధ్య బల మైన సంబంధాలు ఉన్నాయని, అ మెరికా ఇప్పుడు చాలా భిన్నమైన ప్రత్యర్థితో ఆడుతోందని హెచ్చరించ డం కొసమెరుపుగా ఆర్థిక పరిశీలకు లు భావిస్తున్నారు.