Amit Shah : ప్రజా దీవెన న్యూఢిల్లీ: చత్తీస్ ఘడ్ లో రెండు రోజులుగా జరుగుతోన్న ఎన్ కౌంటర్ లో 16 మంది మావో యిస్టులు మృతిచెందిన నేపథ్యం లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ కౌంటర్ కు సంబంధించి పాల్గొన్న దళాలను శభాష్ అంటూ అమిత్ షా సంచలన ట్వీట్ చేశారు. ఛత్తీస్ గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌం టర్ లో 16 మంది మావోయిస్టులు మృతిచెందారు.గిరియాబంద్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఒడిశా రాష్ట్ర కార్యదర్శి చలపతి మృతి చెందా డు.
మావోయిస్టు నేత చలపతిపై రూ.కోటి రివార్డ్ ఉంది. ఇక ఛత్తీస్ గఢ్-ఒడిశా సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో 16 మంది మా వోయిస్టులు మృతి చెందిన నేప థ్యంలోనే అమిత్ షా పుండు మీద కారం చల్లారు.ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంట ర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొ న్న బలగాలపై ప్రశంసలు గుప్పించా రు అమిత్‌షా. ఇది నక్సల్ ఫ్రీ భార త్‌లో భాగంగా కీలక ముందడుగు. నక్సలిజం చివరిదశలో ఉందన్నా రు.