–కొత్త చట్టాల కింద గ్వాలియర్‌లో తొలి కేసు నమోదు
— కేసు నమోదు నుంచి మూడు నెలల్లోనే చేకూరనున్న న్యాయం
— విపక్షాలది అనవసర రాద్ధాంతం
–మీడియాతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
Amit Shah: ప్రజా దీవెన,న్యూఢిల్లీ: కొత్త నేర న్యాయ చట్టాల (New criminal justice laws) కింద సుప్రీం కోర్టు స్థాయిలో ఎఫ్‌ఐఆర్ నమోదైన మూ డేళ్లలో అన్ని కేసుల్లో న్యాయం లభి స్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)పేర్కొన్నారు. 90 శాతం కేసుల్లో దోషులు ఎవరో తేలి శిక్షలు పడతా యని, భవిష్యత్తులో దారుణాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘ నిరీక్షణలకు అవకా శం లేకుండా, న్యాయ ప్రక్రియకు కాల పరిమితిని నిర్దేశించామన్నా రు. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు నుంచి నాలుగేళ్లలో పూర్తి సాంకేతిక తతో ప్రపంచంలో మనదే అత్యాధు నిక నేర న్యాయ వ్యవస్థ అవుతుం దని తెలిపారు. కొత్త చట్టాలు అమ ల్లోకి వచ్చిన పది నిమిషాలకు ఆది వారం అర్ధరాత్రి 12.10కు మధ్యప్ర దేశ్ గ్వాలియర్‌లో (Gwalior)ద్విచక్ర వాహన చోరీపై తొలి కేసు నమోదైనట్లు అమిత్ షా చెప్పారు. ఢిల్లీలోని (delhi) వీధి వ్యాపారిపై మొదటి కేసు నమోదై నట్లు వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారని తెలిపారు.
బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో శిక్షకు ప్రాధా న్యం ఉందని, తాము మాత్రం న్యా యానికి పెద్దపీట వేశామని, జీరో ఎఫ్‌ఐఆర్, ఈ–ఎఫ్‌ఐఆర్, ఎలక్ట్రా నిక్, డిజిటల్ సాక్ష్యాల (Electronic and digital evidence)ద్వారా ఫిర్యాదు నమోదును సులభతరం చేశామని వివరించారు. మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన అధ్యాయాన్ని చేర్చడం, ఏడు రోజుల్లో విచారణ నివేదికను ఫైల్ చేయాలనే నిబంధన ద్వారా కొత్త చట్టాలను మరింత సమర్థంగా తీసుకొచ్చామని, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలు, మూక దాడులకు నిర్వచనం ఇచ్చామని తెలిపారు. మూక దాడుల నిరోధా నికి ప్రత్యేక నిబంధన తీసుకొ చ్చా మని, లైంగిక దాడుల ఉదం తాల్లో బాధితులరాలి ఇంటి వద్దనే, సంర క్షకుల సమక్షంలో మహిళా పోలీసు (woman police) ద్వారా వాంగ్మూలం నమోదుకు అవకాశం ఉంటుందని అమిత్ షా తెలిపారు. కొత్త చట్టాల్లో పోలీసుల కు మరిన్ని అధికారాలను ఇవ్వలేద ని స్పష్టం చేశారు. రిమాండ్ వ్యవధి 15 రోజులు మాత్రమే ఉంటుంద న్నారు. కాగా, కొత్త క్రిమినల్ చట్టాల (New criminal justice laws) పై సందేహాలు ఉంటే నివృత్తి చేయ డానికి పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ కంట్రోల్ రూంను నెలకొల్పిం దని, న్యూఢిల్లీలోని బీపీఆర్‌డీ ప్రధాన కార్యాలయంలో ఇది ఏర్పాటైందని వెల్లడించారు.