Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anam Ramanarayana Reddy: ఆధ్యాత్మిక కేంద్రంగా పవిత్ర సంగమం

— సిఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం
–పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా పవిత్ర సంగమం
— ఏపి మంత్రులు రామనారాయ ణరెడ్డి, నారాయణ, పార్థసారథి

Anam Ramanarayana Reddy: ప్రజా దీవెన, ఇబ్రహీంపట్నం : పవిత్ర సంగమాన్ని మరింత శోభాయమా నంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు రాష్ట్ర దేవదా య, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) తెలిపారు.‌ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతాన్ని మున్సిపల్ అండ్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ (Narayana), సమాచార అండ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పా ర్థసారథితో (K. Parthasarathy) కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసంద‌ ర్భంగా మంత్రి ఆనం (Anam Ramanarayana Reddy) మాట్లాడుతూ గతం కంటే మెరుగ్గా పవిత్ర సంఘం తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. 30 నుంచి 45రోజుల్లోగా కృష్ణమ్మకు నిత్య హారతులను పునః ప్రారం భించేందుకు లక్ష్యంగా పెట్టుకు న్నట్లు వివరించారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు సూచనలు ఇచ్చామన్నారు. పర్యాటక, ఆధ్యా త్మిక కేంద్రంగా పవిత్ర సంగమాన్ని తయారు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ ఏదైనా ఆలయం నిర్మించా లని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వివరిం చారు. ఆలయ నిర్మాణానికి గతం లోనే చంద్రబాబు (chandra babu) భూ సేకరణ చేయాలని చెప్పారన్నారు. ఎలాంటి ఆలయం నిర్మించాలో వైదికంగా, ఆధ్యాత్మికంగా, వైదిక శాస్త్రం ప్రకారం దేవదాయ శాఖ కమిషనర్ కు ఆదేశాలు ఇస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి ఆలోచనలతో కార్య రూపం దాల్చే విధంగా చూస్తామని చెప్పారు. మంత్రి నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ పవిత్ర సంగమాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అన్ని శాఖల సమ న్వయంతో పూర్వ వైభవం వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పవిత్ర సంగమం ఐకానిక్ ప్రాంతంగా మారబోతుందన్నారు. పర్యాటకుల కు ఆహ్లాదాన్ని పంచేందుకు పర్యాట క కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికా రులు పాల్గొన్నారు.