–కూటమి ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేనేలేదు
–సాక్ష్యాధారాలు లభిస్తే జగన్‌తో సహా ఎవరినీ వదిలిపెట్టబోo
–మద్యం, వివేకా హత్య కేసుల్లో జగన్ ప్రమాణం చేస్తారా
— ఆంద్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
Andhra Pradesh Minister Nara Lokesh: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్ర దేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ హామీ ల అమలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధా న్యతనిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నా రా లోకేశ్ పేర్కొన్నారు. మమ్మల్ని ప్రజలు గెలిపించింది రాష్ట్రాన్ని అభి వృద్ధి పథంలో నడిపించడానికి, ప్ర జా సంక్షేమానికి పెద్దపీట వేయడా నికని గుర్తు చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం గా మంత్రినారా లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు. మద్యం కుం భకోణంలో జగన్‌కు ఒక్క పైసా కూ డా ముట్టలేదని దేవుడిపై ప్రమాణం చేయగలరా అని బహిరంగ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబు తూనే, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఢిల్లీ పర్య టన అనంతరం మీడియాతో మా ట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మద్యం కుంభకోణంపై జగన్‌మోహ న్‌రెడ్డిని ఉద్దేశిస్తూ లోకేశ్ తీవ్ర వ్యా ఖ్యలు చేశారు.మద్యం వ్యాపారం లో ఒక్క పైసా కూడా తినలేదని జ గన్ దేవుడి మీద ప్రమాణం చేయా లని, ఇదే నా సవాల్. గతంలో వి వేకా హత్య కేసులో మా కుటుంబా నికి ఎలాంటి సంబంధం లేదని నేను ప్రమాణం చేస్తానని, మీరు కూడా రావాలని అలిపిరిలో సవాలు విసి రితే జగన్ పారిపోయారని గుర్తుచే శారు. చంద్రబాబు నిజంగా కక్ష సా ధించాలనుకుంటే రెండు నిమిషాలు పట్టదని, కానీ తాము విధానాల ప్రకారమే వెళ్తామని, ప్రజలు తమ ను గెలిపించింది పరిపాలించడాని కి, సంక్షేమం, అభివృద్ధి చేయడానికి తప్పితే కక్షసాధింపులతో ఎవరినో జైల్లో పెట్టడానికి కాదని స్పష్టం చేశా రు. అయితే, చట్టాన్ని ఉల్లంఘించి న వారిపై, ప్రజాధనాన్ని దుర్విని యోగం చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, సాక్ష్యా ధారాల ప్రకారమే ముందుకు వెళ్తా మని హెచ్చరించారు. మద్యం కేసు లో త్వరలో చార్జిషీట్ దాఖలు చేస్తా రని, మనీలాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొ నడం జగన్ ప్రభుత్వ హయాంలోని వ్యవహారాలపై దర్యాప్తు ముమ్మరం కానుందనడానికి సంకేతంగా కనిపి స్తోందన్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎవరిపై నా కక్ష సాధింపు చర్యలు చేపట్టదని లోకేశ్ పునరుద్ఘాటించారు. అయితే గత ప్రభుత్వంలో జరిగిన తప్పుల ను, చట్ట ఉల్లంఘనలను మాత్రం ఉ పేక్షించేది లేదన్నారు. ‘‘చట్టం తనప ని తాను చేస్తుంది. సాక్ష్యాధారాలు ఉంటే ఎవరైనా చట్టం ముందు సమానులేనని లోకేశ్ వ్యాఖ్యానిం చారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జ రిగిన భేటీ గురించి లోకేశ్ తొలి సా రి ప్రస్తావించారు. ఆ భేటీని ‘అన్‌బి లీవబుల్’గా అభివర్ణించారు. మోదీ తన 25 ఏళ్ల రాజకీయ జీవితానుభ వాలను తనతో పంచుకున్నారని తెలిపారు. నాన్న నీడ నుంచి బయ టకురా, కష్టపడు. భవిష్యత్తు యు వకులదే, కష్టపడి ఎదగాలని మోదీ తనకు సూచించినట్టు లోకేశ్ పేర్కొ న్నారు. గత ప్రభుత్వ హయాంలో కుంటు పడిన అభివృద్ధిని తిరిగి గా డిలో పెడతామని లోకేశ్ స్పష్టం చేశారు.
తల్లికి వందనం కార్యక్రమం దాదా పు 95 శాతం పూర్తయింది. జులై 5 కల్లా మిగిలిన సమస్యలు పరిష్క రించి 100 శాతం పూర్తి చేస్తాం. సూ పర్‌సిక్స్ పథకాలను దశలవారీగా అమలు చేస్తామని వివరించారు. జులై చివరి నాటికి విశాఖలో టీసీ ఎస్ కార్యకలాపాలు ప్రారంభమవు తాయని, అదే రోజు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన జరుగు తుందని తెలిపారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు రూ. 2000 కోట్లు క్లియర్ చేశామని, కార్యకర్తలపై గత ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసు లను ఎత్తివేసేందుకు చర్యలు తీసు కుంటున్నామని తెలిపారు.