Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anganavadi Centers: అమ్మ మాట.. అంగన్వాడీ బాట

*అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచేందుకు స్పెషల్ డ్రైవ్.

Anganavadi Centers:ప్రజా దీవెన, కోదాడ: అమ్మ మాట అంగనవాడి బాట అనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం మున్సిపల్ పరిధిలోని తమ్మర బండ పాలెం గ్రామంలో అంగనవాడి టీచర్ల (Anganavadi teachers) ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ (Special drive) కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామములో ర్యాలీ నిర్వహించారు అనంతరం అంగన్వాడి టీచర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో (Anganwadi centers) పూర్వ ప్రాథమిక విద్యను అమలు చేయాని నిర్ణయించింది.ఈ మేరకు అంగన్వాడీ టీచర్లకు పూర్వప్రాధమిక విద్య (ఈసీసీ)పై ప్రత్యేకంగా శిక్షణ అందించారు.శిక్షణ పొందిన మేము పిల్లలకు ఆటపాటలు,కథలతో పాటు,సంభాషణ నైపుణ్యాలు నేర్పిస్తున్నామని అన్నారు.చిన్నారుల సంఖ్యను పెంచేందుకు అంగన్వాడీ బాట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.పూర్వ ప్రాథమిక విద్య,బోధనా పద్ధతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మరీస్కూలుప్రధానోపాధ్యాయురాలుఇందిరాప్రియదర్శిని,అంగన్వాడి టీచర్లు షేక్ లాల్ బి, రమ,ఆశ కార్యకర్త కవిత,అంగన్వాడీ పిల్లలు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు