Anjan Goud : ప్రజాదీవెన కోదాడ : ఎలక్ట్రాన్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు పడిశాల రఘు మృతి బాధాకరమని ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారంగుల అంజన్ గౌడ్ అన్నారు రఘు దశ దిశ కర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన పాల్గొని రఘు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రఘు కుటుంబానికి అండగా ఉండి ప్రభుత్వం నుండి రావలసిన ఆర్థిక సహాయాన్ని దగ్గరుండి అందరి సహాయ సహకారాలు తీసుకొని ఎమౌంటు కుటుంబానికి అందేటట్టు విచ్చేస్తానని తెలిపారు .
అలాగే కోదాడ ఎలక్ట్రాన్ మీడియా నుండి ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు కోదాడ నియోజకవర్గంలో ఎలక్ట్రాన్ మీడియా ను బలోపేతం చేసేందుకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు రఘు కుటుంబానికి అన్నివేళలా అండదండలుగా ఉండి ప్రతి విషయంలో ఆదుకుంటామని తెలిపారు రఘు కి నివాళులర్పించిన వారిలో ఎలక్ట్రాన్ మీడియా ప్రింట్ మీడియా విలేకరులు ఉన్నారు