మరోమారు అమిత్ షా రాక
— రాష్ట్రంలో పర్యటనకు బీజేపీ కార్యాచరణ
ప్రజా దీవెన /హైదరాబాద్: తెలంగాణలో మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (amith Shah )ర్యటించనున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటన ముగించుకున్న అమిత్ షా వెంటనే రెండోసారి పర్యటించేందుకు సిద్ధమైన క్రమంలో తెలంగాణ బీజేపీ కార్యచరణ రూపొదింస్తుంది.
ఈ పర్యటనలో అమిత్ షా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వరంగల్ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ ( Telangana Liberation Day) కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. గతేడాది నుంచి సెప్టెంబర్ 17వ తేదీను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో( At the Secunderabad Parade Grounds) కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈసారి వరంగల్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్ర భద్రత దళాలతో వరంగల్‌లో కవాతు ( Marching in Warangal with Central Security Forces) నిర్వహణకు ప్లాన్ రూపొందిస్తున్నారు.ఈ కవాతులో అమిత్ షా గౌర వందనం స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచిన నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తికరంగా మారనుంది.