Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anti aging:జీవితకాలం ఆరోగ్యంగా..!

–వయసుతో పాటు సంభవించే శారీ రక దుర్భలత్వాన్ని అధిగమించే ప్రయత్నం
–పరిశోధనల్లో సింగపూర్‌ శాస్త్ర వేత్తలు పై చేయి సాధించిన వైనం
–వయసు పెరుగుదలకు కారణమ వుతున్న ఐఎల్‌–11 ప్రోటీన్‌ను తొలిసారిగా గుర్తింపు

Anti aging:ప్రజా దీవెన, వాషింగ్టన్‌: జీవించి నంత కాలం ఆరోగ్యంగా ఎక్కువ కాలంపాటు జీవించటం ఇదే ప్రస్తుత సమాజంలో మనుషులు కోరుకు నేది. కాలం గడుస్తున్నకొద్దీ మనిషి సగటు జీవితకాలం పెరుగుతున్న క్రమంలో దానిని మరింత పెంచటా నికి, ముఖ్యంగా వయసు పెరుగు తున్న కొద్దీ సంభవించే శారీరక దుర్భలత్వాన్ని అధిగమించటానికి అనేక (యాంటీ ఏజింగ్‌) పరిశోధన లు జరుగుతున్నాయి. ఈ దిశగా సింగపూర్‌ శాస్త్రవేత్తలు తాజాగా ఓ ముందంజ వేశారు. వయసు పెరు గుదలకు కారణమవుతున్న ఓ ప్రోటీన్‌ను వారు తొలిసారిగా గుర్తిం చారు. ఈ ప్రోటీన్‌ ఉత్పత్తిని (Protein production)అడ్డు కోవటం ద్వారా వయసు పెరుగు తున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత ప్రక్రియ వేగాన్ని తగ్గించవ చ్చని తెలిపారు. తద్వారా దీర్ఘకా లం జీవించే అవకాశం ఉంటుంద న్నారు. సింగపూర్‌లోని డ్యూక్‌– ఎన్‌యూఎస్‌ మెడికల్‌ స్కూల్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వ హించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరులో ఇంటర్‌ల్యూకిన్‌ (Interleukin)(ఐఎల్‌–11) అనే ప్రోటీన్‌ కీలక ప్రభావం చూపుతున్న విషయాన్ని వీరు గుర్తించారు. ఈ ప్రోటీన్‌ ఉత్పత్తి పెరుగుతున్నా కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరు కుపోతోందని, కండరాలు బలహీ నపడుతున్నాయని వెల్లడైంది. ఇవన్నీ శారీరక ధృడత్వాన్ని తగ్గించి తద్వారా వయసు పెరుగుదల ప్రక్రియను కొనసాగించే లక్షణాలే.

ఆడ ఎలుకల్లో ఆయుర్దాయం మరింత వృద్ధి సింగపూర్‌ శాస్త్రవేత్తలు (Growth Singapore scientists) తమ పరిశోధన కొనసాగిస్తూ ఎలుకలపై ప్రయోగాలు నిర్వహిం చారు. వాటి నుంచి ఐఎల్‌–11 ప్రోటీన్‌ను తొలగించటం, ఐఎల్‌– 11 నిరోధక చికిత్సను నిర్వహించ టం వంటివి జరిపారు. దీని ద్వారా ఎలుకల్లో వయసు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత, వ్యాధులు, బలహీనత మొదలైన వాటి నుంచి రక్షణ లభించింది. వాటి సగటు జీవితకాలం 24.9% పెరిగింది. 75 వారాల వయసులో ఉన్న ఎలుకల్లో (ఇది మనుషుల్లో దాదాపు 55 ఏళ్ల వయసుతో సమా నం) ఐఎల్‌–11 నిరోధక చికిత్సను ప్రారంభించి అవి మరణించే వరకు కొనసాగిస్తే.. మగ ఎలుకల సగటు జీవితకాలం 22.5%, ఆడ ఎలుకల సగటు జీవితకాలం 25% పెరిగింది. అంతేకాదు, ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే తెల్ల కొవ్వు బదులు క్యాలరీలను ఖర్చు చేసే బ్రౌన్‌ఫ్యాట్‌ ఉత్పత్తి ఎలుకల్లో (Brownfat production in rats) మొదలైంది. గుం డె సంబంధిత సమస్యల నుంచి కూడా వాటికి రక్షణ లభించింది. ఈ ఫలితాలపై డ్యూక్‌–ఎన్‌యూఎస్‌ డీన్‌ ప్రొఫెసర్‌ థామస్‌ కాఫ్‌మన్‌ మాట్లాడుతూ, ఐఎల్‌–11 ప్రోటీన్‌ గురించి తాజాగా వెల్లడైన అంశాలు వృద్ధులు మరింత ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించటానికి దోహ దపడతాయని చెప్పారు. కండరాల పటుత్వం, శారీరక దృఢత్వం పెరగ టం ద్వారా వృద్ధులు జారి పడిపో యే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు.ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యవంతమైన దీర్ఘకా లిక జీవితాలు గడిపేలా ఐఎల్‌–11 చికిత్సను అందరికీ అందుబాటు లోకి తీసుకురావాలన్నది మా లక్ష్య మని పరిశోధనలో పాలు పంచుకు న్న శాస్త్రవేత్త స్టార్ట్‌కుక్‌ పేర్కొన్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివ రాలు తాజాగా సైన్స్‌ జర్నల్‌ నేచర్‌ లో ప్రచురితమయ్యాయి. వయసు పెరుగుదల ప్రక్రియను నెమ్మదింప జేసే పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మనుషుల జీవితకాలాన్ని ఒక ఏడాది కాలం పాటు పొడిగిస్తే అది 38 ట్రిలియన్‌ డాలర్ల (రూ.83,62,225 కోట్ల) సంపదను సృష్టిస్తుందని అంచనా చేస్తున్నారు.