Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AP Govt: 30 జిల్లాలుగా కొత్త ఆంధ్రప్రదేశ్ పునర్విభజన… ముహూర్తం ఖరారు

AP Govt: ప్రజా దీవెన అమరావతి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా జరిగిన జిల్లాల విభజనను వాటి ద్వారా వచ్చిన సమస్యలను కరెక్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం పూర్తి ప్రతిపాదనలు రెడీ చేసింది. మొత్తం 30 జిల్లాలగా పునర్విభజన (redistribution) చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం డ్రాఫ్ట్ రెడీ అయి నట్లుగా చెబుతున్నారు. ఏపీ చిన్నా తక్కువ జనాభా ఉన్న, 17 మాత్రమే పార్లమెంట్ స్థానాలు అదీ కూడా గ్రేటర్ పరిధిలోనే అత్యధిక జనాభా ఉన్నప్పటికి 33 జిల్లాలుగా చేశారు. కానీ ఏపీలో (ap) 26 జిల్లాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

వైసీపీ (ycp) హయాంలో ఏర్పాటు చేసిన జిల్లాలకు సరైన ప్రాతిపదిక లేకుం డా పోయింది. కొన్ని జిల్లాలకు అస లు హెడ్ క్వార్టర్ ఎక్కడో వందల కిలోమీటర్ల (km) దూరం ఉంది. అల్లూరి జిల్లా విషయంలో ఇదే తప్పు జరి గింది. అందుకే చంద్రబాబు తాము వస్తే జిల్లాల విభజన విషయంలో జరిగిన తప్పును సరి చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు కసరత్తు పూర్తయినట్లుగా తెలుస్తోంది. తా జాగా పలాస, నాగావళి, నూజివీ డు, తెనాలి, అమరావతి (Palasa, Nagavali, Nujivi Du, Tenali, Amaravati)కేంద్రంగా అమరరామ , మార్కాపురం, మద నపల్లి, హిందూపురం,ఆదోని గా కొత్త జిల్లాలను ప్రతిపాదించిన ట్లు గా డ్రాఫ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జగన్ జిల్లాలను మార్చారు కానీ ఇంకా ఉమ్మడి జిల్లాల కేంద్రంగానే ఎక్కువ పనులు జరుగుతున్నాయి. దీనికి కారణం మౌలిక సదుపాయాలు కల్పించలేక పోవడమే. జిల్లాల విభజన చేసి త న పని అయిపోయిందనుకు న్నా రు జగన్. కానీ ఉద్యోగులు, ప్రజల కు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇప్పుడు మొత్తాన్ని సంస్కరించి.. మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.