Ap TDPBJP janasena alliance victory : ఆంధ్రప్రదేశ్ లో అంబరాన్నoటుతోన్న ‘ సంబరాలు’
--కొనసాగుతోన్న తెలుగుదేశం జోరు --సీఎం జగన్ మినహా వైసిపిబేజారు
ఆంధ్రప్రదేశ్ లో అంబరాన్నoటుతోన్న ‘ సంబరాలు’
–కొనసాగుతోన్న తెలుగుదేశం జోరు
–సీఎం జగన్ మినహా వైసిపిబేజారు
ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దే శం పార్టీతో పాటు కూటమి సభ్యులైన జనసేన బిజెపి అభ్యర్థుల జో రు కొనసాగుతోంది. అదే సందర్భంలో అధికార వైసిపి (ycp) పార్టీ లో సీఎం జగన్ (CM jagan) మినహా మిగతా నియోజకవర్గాల్లోని అభ్యర్థులంతా వెనకంజపడడంతో బేజారు నెలకొoది.
ఇదిలా ఉండగా కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోన్న తరుణం లో టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోగా నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. టీడీపీ ( tdp) కార్యా లయం వద్ద సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిస్తూ జరుపు కుంటున్న సంబరాలు అంబరాన్నoటుతున్నాయి. ఏపీలో ఫలితాలు ఊహించేం దుకు వీలు లేకుండా పోయింది.
ఒక్క సీఎం జగన్ మినహా మిగిలిన వారందరూ వెనుకంజలో ఉన్నా రు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ 118 స్థానాల్లో, జనసేన 11 స్థానాల్లో, భాజపా 2 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.ఇక వైసీపీ ప్రస్తుతం 13 స్థానాల్లో ఆధిక్యంలో సరిపుచ్చుకుంటుంది. మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్య నారాయణ, గుడివాడ అమర్నాథ్, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో ఉన్నారు.
స్పీకర్ తమ్మినేని వెనుకంజంలో ఉన్నారు. రాజకీయంగా తలపండిన సీనియర్ నాయకులు, హేమాహేమీలందరూ వెనుకంజలో ఉన్నారు. పి. విశ్వ రూప్, చెల్లుబోయిన వేణుగోపాల్, దాడిశెట్టి రాజా, తానేటి వనిత వీరం దరూ వెనుకంజలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మూడవ రౌండ్ పూర్తయ్యే సరికి 13వేల ఓట్లు పోలై ముందుకు దూ సుకుపోతున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో టిడిపి అభ్య ర్థులు ఆధిక్యతలో ఉన్నారు. ఏపీలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కూటమి అభ్యర్థుల లీడ్‌లో కొనసాగుతున్నారు. ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ, జమ్మలమడుగు తెదేపా అభ్యర్థి చది పిరాళ్ల ఆదినారాయ ణరెడ్డి, తాడికొండలో తెదేపా అభ్య ర్థి తెనాలి శ్రవణ్‌కుమార్, తాడేపల్లి గూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీని వాస్, తదితరులు ఆదిత్యంలో కొనసాగుతున్నారు.
కొల్లులో తెదేపా అభ్యర్థి నిమ్మల రామానాయుడు, సంత నూతల పాడు తెదేపా అభ్యర్థి విజయ్‌కుమార్, గురజాలలో 1311 ఓట్ల ఆధిక్యంలో తెదేపా అభ్యర్థి యరపతినేని కొనసాగుతున్నారు. కళా వెంకట్రావు కూడా ఆధిక్యంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కౌం టింగ్ కేంద్రాల నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితరులు వెను దిరిగారు.