–ఉద్యోగ భద్రత కోసం అందోళన
–విశాఖలో ర్యాలీ, కలెక్టర్ కు వినతి
–ప్రభుత్వ పరిశీలనలో ఉండగానే ఆందోళనలు
AP Volunteers: ప్రజా దీవెన, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల (Volunteers) వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వాలంటీర్లను ప్రస్తుతం ప్రభుత్వం పక్కన పెట్టింది. మూడు నెలలుగా వేచి చూస్తున్న వాలంటీర్లు ఇప్పు డు తమ కార్యాచరణ ప్రకటించా రు. ప్రభుత్వానికి (To Govt) అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారం ఏపీలో కొత్త టర్న్ తీసు కుంది. వాలంటీర్లు నిరసన ప్రారం భించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైనా 2. 60 లక్షల మంది వాలంటీర్ల పరిస్థితి గందరగోళంగా మారింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే మంత్రివర్గ సమావేశం లోపు తమకు న్యాయం చేస్తూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేకుంటే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాల యం ముట్టడిస్తామని ఈనెల 26 నుంచి అక్టోబర్ రెండు వరకు శాం తియుతంగా ఆందోళన చేస్తామని ప్రకటించారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాలంటీర్లు నిరసనకు దిగారు. విశాఖలో తమను విధుల్లో కొనసాగించాలంటూ వాలంటీర్లు (Volunteers) ఆందోళన చేశారు.
కలెక్టరేట్ (Collectorate)వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. వెంట నే తమను విధుల్లోకి తీసుకోవాల ని, చంద్రబాబు ఎన్నికల సమయం లో ఇచ్చిన మాటను అమలు చే యాలని డిమాండ్ చేశారు. అడగ కుండానే పదివేల జీతం ఇస్తామ న్నారని గుర్తు చేశారు. అధికారం లోకి వచ్చి వంద రోజులైనా పట్టిం చుకోవడం లేదంటూ వాపోయారు. జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజల కు సేవ చేయటం కోసం తామంతా నామమాత్రపు వేతనాలతో విధు ల్లోకి వచ్చామని వాలంటీర్లు గుర్తు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతు న్నారని చెప్పుకొచ్చారు కొత్త ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వా త వాలంటీర్ల అంశం పైన చర్చ జరుగుతుంది. తాజాగా జరిగిన మంత్రివర్గ (Cabinet meeting)సమావేశంలోనూ వాలం టీర్లు, సచివాలయాలను ప్రభుత్వ సేవలకు అనుగుణంగా ఎలా విని యోగించుకోవాలనే దానిపైన చర్చ జరిగింది. దీనిపైన పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వాలంటీర్లు తమకు వేతనాలు కూ డా అందడం లేదని వాపోతున్నా రు. ఇప్పుడు వీరు ఆందోళన బాట పట్టడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.