APIIC lands: ప్రజా దీవెన, అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం వద్ద ఉన్న ఏపీఐఐసీ భూములలో (APIIC lands)ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన తగిన పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అలాగే అత్యంత వెనుకబడిన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి (Kalyanadurgam Constituency) అవసరమైన తాగు, సాగునీటిని అందించే బీటీపీ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు తగిన అనుమతులు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు (Amylineni Surendra Babu) కోరారు.
శుక్రవారం తిమ్మసముద్రం ప్రాం తంలోని ఏపీఐఐసి భూములను (APIIC lands)పరిశీలించేందుకు వచ్చిన జిల్లా కలె క్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కలసి నియోజకవర్గంలో నెలకొన్న సమ స్యలను విన్నవించారు. ఇందులో ప్రతి గ్రామానికి అవసరమైన రోడ్లు, గ్రామాల్లో పారిశుధ్యం, సీసీ రోడ్లు, తాగు నీటి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.