–జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి
District President Nagam Varshit Reddy :
ప్రజా దీవెన, నల్గొండ: బిజెపి జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన నూతనంగా నియమితులైన జిల్లా పదాధికారుతో మొదటి సమావేశం నిర్వహించి పదాధికారులకు నియామక పత్రాలు అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్బంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం తెలియజేసాము అని తెలిపారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ ఒకటె అని ఆ రెండు పార్టీలకు సవాల్ చేస్తున్నా అని,జిల్లాలో ఏ గ్రామ పంచాయతీకి రావాలో మీరు నిర్ణయించండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రండి, మా పార్టీ నాయకులం వస్తాం. ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, ఆ గ్రామంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల గురించి చర్చిద్దాం. బీఆర్ఎస్ పాలనతో పాటు, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేస్తున్నా అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేసేందుకు బిజెపి సిద్ధంగా ఉంది అని గ్రామాల్లో అభివృద్ధి పనులకే కాదు,గ్రామీణ ప్రాంతవాసులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే అని ఇదే అభివృద్ధి మంత్రాన్ని ప్రజలకు వివరిస్తాం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరేస్తామని అన్నారు.బీసీలకు ద్రోహం చేస్తూ,నిత్యం బీసీ జపం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.ఓబీసీలను ఉద్ధరించింది తానే అని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీకి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడానికి ఒక్క బీసీ అభ్యర్థి దొరకకపోవడం సిగ్గుచేటు.కానీ బిజెపికి అవకాశం వచ్చిన ప్రతిసారి దేశ అత్యున్నత స్థానంలో ఒక్కో వర్గానికి చెందిన వారిని నియమించింది.
మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ కలాంని, దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ గారిని,ఆదివాసీ గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము ని రాష్ట్రపతులుగా చేసిన ఘనత బిజెపిదే అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతేపాక లింగస్వామి , కంచర్ల విద్యాసాగర్ రెడ్డి , మండల వెంకన్న ,జిల్లా ఉపాధ్యక్షులు మైల నరసింహ , పకీరు మోహన్ రెడ్డి,శాగ చంద్రశేఖర్ రెడ్డి, బచ్చనబోయిన దేవేందర్ యాదవ్ , సజ్జల నాగిరెడ్డి , వనం నరేందర్ రెడ్డి , జిల్లా కార్యదర్శులు ఇస్లావత్ బాలాజీ , తాటిపాముల శివకృష్ణ , యిరిగి శెట్టి అనిత ,పబ్బు వెంకటేశ్వర్లు ,జిల్లా కోశాధికారి కాసాల జనార్దన్ రెడ్డి ,జిల్లా కో కోశాధికారి శ్రీ తుమ్మలపల్లి హనుమంత రెడ్డి ,బిజెపి కార్యాలయ కార్యదర్శి గోశెట్టి భద్రమ్మ ,కార్యాలయ సహా కార్యదర్శి శ్రీ మంగళపల్లి కృష్ణమూర్తి ,ఐటీ కన్వీనర్ వేణు మరియు తదితరులు పాల్గొన్నారు.