Professor Arjuna Rao : పానగల్ సోమేశ్వరాలయాలను సం దర్శించిన పురావస్తుశాఖ సంచాల కులు ప్రొఫెసర్ అర్జునరావు
Professor Arjuna Rao : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలం గాణ రాష్ట్ర పురావస్తుశాఖ సంచాల కులుగా నియమితులైన ప్రొఫెసర్ అర్జునరావు కుతాడిని బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన నల్ల గొండ జిల్లాలోని పానగల్ గ్రామంలో ఉన్న రాష్ట్ర రక్షిత కట్టడాలైన పచ్చ ల సోమేశ్వర ఆలయం, ఛాయా సో మేశ్వర దేవాలయం, జిల్లా పురా వస్తు ప్రదర్శనశాలను ఆదివారం సందర్శించారు.
ఆలయాల స్థితిగతులను పరిశీలిం చిన అనంతరం, వాటి అభివృద్ధి కోసం పురావస్తు శాఖ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు మరియు పర్యాటకులకు ఆలయాల చరిత్ర తెలియజేసే వి ధంగా సైన్‌బోర్డులు, వివరణాత్మక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదే శించారు.అదేవిధంగా, ఆలయ గో డలపై ఉన్న వైట్‌వాష్‌ను వెంటనే ర సాయనిక శుద్ధి (కెమికల్ క్లీనింగ్) చే సి, శిల్ప సంపదను, చరిత్రను భ క్తులు, పర్యాటకులు స్పష్టంగా చూ డగలిగేలా చేయాలని ఆదేశించా రు.
ఆలయంలో ఉన్న శాసనాల వివరా లను కూడా బోర్డుల రూపంలో ప్రద ర్శించి చరిత్రకారులకు, పర్యాట కు లకు అందుబాటులో ఉంచాలని సూచించారు.పర్యాటకులకు ఆల య చరిత్ర వివరించడానికి ఒక టూ రిస్ట్ గైడ్‌ను కూడా నియమించాలని ఆయన పేర్కొన్నారు. పచ్చల సో మేశ్వర ఆలయం, ఛాయా సోమే శ్వ mర ఆలయంలో సంరక్షణ పను లు చేపట్టాలని ఆయన ఆదేశించా రు. సంచాలకులు పురావస్తు శాఖ సిబ్బంది తయారుచేసిన అంచనాల ను క్షుణ్ణంగా పరిశీలించి, ఈ అంచ నాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీ సుకెళ్లి త్వరలోనే అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.
జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను కూడా ఆయన తనిఖీ చేశారు. ఈ ప్రదర్శనశాల జిల్లాకే తలమానికమై నది. దానిని 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఇందులో కొత్తగా అభివృద్ధి చర్యలు చేపట్టాలని ఆ యన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసంచాలకు లు డాక్టర్ పి. నాగరాజు, ఎన్. న ర్సింగ్ నాయక్, మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన చరిత్రకా రులు డాక్టర్ హమ్మద్ షరీఫ్, డాక్టర్ కిషోర్, పాల్ రెడ్డి వెంకట్ రెడ్డి,గుం డగోని యాదయ్య గౌడ్, కొడిదల ఎ ల్లయ్య, గుండగోని శ్రీనివాస్ గౌడ్, పురావస్తు ప్రదర్శనశాల సిబ్బంది పాల్గొన్నారు.