Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Arrangements for the CM’s meeting are fast శర వేగంగా సీఎం సభ ఏర్పాట్లు

--నిరంతర పర్యవేక్షణలో మంత్రి జగదీష్ రెడ్డి --సభాస్థలికి నలుదిక్కలా రహదారులకు మెరుగులు  --సరికొత్త శోభను సంతరించుకున్న సూర్యాపేట

 శర వేగంగా సీఎం సభ ఏర్పాట్లు

–నిరంతర పర్యవేక్షణలో మంత్రి జగదీష్ రెడ్డి 

–సభాస్థలికి నలుదిక్కలా రహదారులకు మెరుగులు 

–సరికొత్త శోభను సంతరించుకున్న సూర్యాపేట

ప్రజా దీవెన/ సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రం లో సిఎం సభ సందర్భంగా ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. సభా ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి నిరంతరం పర్యవెక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం సూర్యాపేట లోని ఈనాడు కార్యాలయం ముందు ఉన్న సభా స్థలి ని పరిశీలించిన మంత్రి సభ కు తరలి వచ్చే వారి కోసం నలువైపులా ఉన్న రహదారుల ను మరమత్తులు చేయాలని అదేశించారు.

రెండు గంటల పాటు సభ స్థలి కి ప్రజలు తరలి వచ్చే రహదారులను నేరుగా పరిశీలించారు.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా అవసరం ఉన్న చోట మరమ్మతులను యుద్ద ప్రాతి పదికన చేయాలని ఆదేశించారు. సిఎం సభ సందర్భంగా రహదారులు నూతన శోభ ను సంతరించుకున్నాయి.

జాతీయ రహదారి నుండి మార్కెట్ కు వెళ్లే రహదారి ని బి. టి రోడ్ గా మారిపోయింది.సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సభకు తరలివచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు సూచించారు.

సిఎం పర్యటనలో సమీకృత కలెక్టరేట్‌ భవనంతో పాటు జిల్లా పోలీస్‌ కార్యాలయం, మెడికల్ కళాశాల భవనం, ఇంటిగ్రిటెడ్ మార్కెట్ తో పాటు బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సైతం ప్రారంభించనున్నారు.