Arvind Kejriwal:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసుకు (Case of Excise Policy)సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)తో పాటు ఇతరులపై రూస్ అవె న్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ప్రతీకారం తీర్చుకోవాలని హర్యానా ప్రజలను కోరిన ఒక రోజు తర్వాత ఈ చర్య తెరమీదకు వచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని గెలి పించడం ద్వారా తన భర్తను తప్పు డు కేసులో జైలులో (jail) పెట్టడం అవ మానకరమని వ్యాఖ్యానించింది.
ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజా బ్‌ల (Delhi, Punjab) కోసం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)చేసి న కృషిని చూసి ప్రధాని నరేంద్ర మోదీ అక్కసుతో ఉన్నారని ఆమె పేర్కొన్నారు.ఎక్సైజ్ పాలసీ స్కా మ్‌తో (Case of Excise Policy)ముడిపడి ఉన్న మనీలాం డరింగ్ కేసుకు సంబంధించి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీ వాల్‌ను మార్చి 21న ఈడి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకో ర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సిబిఐ అరెస్టు కారణంగా అతను జైలులో నే (jail) కొనసాగుతుండడం కొసమెరుపు.