Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Arvind Kejriwal: బెయిల్‌ ఉత్తర్వులపై హైకోర్టు స్టే

–కోర్టు ఆదేశాలతో విడుదల నిలుపుదల

Arvind Kejriwal:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: డిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయి న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు సాధారణ బెయిల్‌ (BAIL) మంజూరు చేస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు (High Court of Delhi) నిలిపివేసింది. కేజ్రీవాల్‌ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ పిటిషన్‌ వేసిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ ఆదే శాలిచ్చింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు గురువారం సాయంత్రం రెగ్యులర్‌ బెయిల్‌ లభించింది. రూ.లక్ష వ్యక్తి గత బాండు సమర్పించిన తర్వాత ఆయన్ను విడుదల చేయవచ్చని న్యాయమూర్తి (Judge)ఆదేశించారు. ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటల పాటు పక్కన పెట్టాలని ఈడీ చేసిన వినతిని ట్రయల్‌ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే శుక్రవారo ఆయన జైలు (JAIL)నుంచి విడుదల కావాల్సి ఉండగా ఈడీ హైకోర్టును ఆశ్రయించింది.ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దర్యాప్తు సంస్థ పిటిషన్‌ దాఖలు చేసింది. ‘బెయిల్‌ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు. వెకేషన్‌ బెంచ్‌ మా వాదనలను వినిపించేందకు సరిపడ సమయం ఇవ్వలేదు’ అని ఈడీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తమ పిటిషన్‌పై అత్యవసర చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు. దీనిపై శుక్ర వారమే విచారణ జరుపు తామని వెల్లడించింది. అప్పటి వరకు ట్రయ ల్‌ కోర్టు ఉత్తర్వులను అమలు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.