–ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ లు రాజ్యాం గం ప్రకారమే అమలు
— ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ లలో క్రిమీలేయర్ కు అవకాశం లేదు
–అంబేడ్కర్ రాజ్యాంగంలో క్రీమీలే యర్ నిబంధన లేనేలేదు
–ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇళ్లకు ఆమోదం
— ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో 173.63 కి.మీ. కొత్త లైన్లకు సైతం
–మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
Ashwini Vaishnav: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారత రా జ్యాంగం కల్పించిన నియమ, నిబం ధనలు తూచా తప్పకుండా అనుస రిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మం త్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnav) డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ రచించిన రా జ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కల్పిం చిన రిజర్వేషన్లలో క్రీమీలే యర్ నిబంధన లేనేలేదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజ ర్వేషన్లకు(SC and ST Reservations) సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు చేసిన నిర్దిష్టమైన సూచనలపై క్యాబినెట్‌లో పూర్తి స్థాయిలో మేధో మథనం చేసిన తర్వాత రాజ్యాం గంలో ఉన్న నిబంధనలకే కట్టుబడి ఉండాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణ యించిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేం ద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబి నెట్ సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. అనంతరం ఆ వివరాల ను వైష్ణవ్ విలేకరులకు వివరించా రు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ (SC and ST Reservations)నిబంధన లన్నీ రాజ్యాంగం ప్రకారమే ఉంటా యని పునరుద్ఘాటించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఇటీ వల సుప్రీం కోర్టు పచ్చజెండా ఊపి న విషయం తెలిసిందే. రాష్ట్రాలు తమ పరిధిలో వర్గీకరణ చేసుకో వచ్చని తెలిపింది. అదే సమయం లో, ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్‌ను గుర్తించడానికి ఓ విధానాన్ని నిర్దే శించుకోవాలని, రిజర్వేషన్లలో నిజ మైన సమానత్వం సాధించడానికి ఇదే మార్గమని కూడా వ్యాఖ్యానిం చింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చించి రాజ్యాంగానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. తద్వారా సుప్రీం కోర్టు సూచించినట్లు ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీ లేయర్‌ను అమలు చే సేది లేదని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథ కం కింద మరో మూ డు కోట్ల ఇళ్లను నిర్మించాలని మోదీ 3.0 తొలి క్యాబినెట్‌లో తీర్మానిం చిన విషయం తెలిసిందే. తాజా భేటీలో సదరు అంశానికి ఆమోదం తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో (rural area)రెం డు కోట్ల ఇళ్లను నిర్మించనుండగా అందుకు రూ.3 లక్షల కోట్లు ఖర్చ వుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కేంద్రం రెండు లక్షల కోట్లు, ఆయా రాష్ట్రాలు లక్ష కోట్లను ఖర్చు చేయనున్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో కోటి ఇళ్లను ని ర్మించడానికి పచ్చ జెండా ఊపింది. ఇందుకు రాబోయే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లను ఖర్చు చేయనుంది. కాగా హార్టీకల్చర్ రంగాన్ని విప్లవా త్మకం చేయడంలో భాగంగా రూ.17 66 కోట్లతో క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ (సీపీపీ) పథకానికి క్యాబినెట్ ఆమో దం తెలిపింది. పంటను, నాణ్యత ను దెబ్బతీస్తున్న వైరస్ ఇన్ఫెక్షన్ల (Virus infections)సమస్యను పరిష్కరించడమే ధ్యేయమని వ్యాఖ్యానించారు.