–తీర్మానం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ
–క్రీమీలేయర్ సిఫారసులు తిరస్క రణ
–త్వరలో గెజిట్ నోటి ఫికేషన్‌కు కసరత్తు
Assembly : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలోని ఎస్సీలను 3 గ్రూ పులుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. షెడ్యూల్డు కు లాల్లో సంఖ్యాపరంగా అధికంగా ఉన్న మాదిగ, ఉప కులాలకు 9% రిజర్వేషన్లు ఖరారు చేసింది.మాల, ఉప కులాలకు 5%; అత్యంత వెన కబడిన బుడ్గ జంగం తదితర కులా లకు ఒక శాతం రిజర్వేషన్‌ను కేటా యించింది. ఈ మేరకు ఎస్సీ వర్గీక రణపై నియమించిన జస్టిస్ షమీ మ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేది కను తొలుత క్యాబినెట్‌లో, ఆ త ర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమో దించింది. తద్వారా, సుప్రీం తీర్పు అనంతరం ఎస్సీలను వర్గీకరించి, రిజర్వేషన్ల ఖరారు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి రాష్ట్రంలో నిలిచింది.
కమిషన్ సిఫారసు చేసినా వర్గీ కరణలో క్రీమీలేయర్ విధానాన్ని అమలు చేయడం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు గత ఏడాది ఆగస్టు ఒక టో తేదీన ఇచ్చిన తీర్పుపై స్పందిం చిన తెలంగాణ ప్రభుత్వం వర్గీక రణకు కట్టుబడి ఉన్నట్లు అదే రోజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ అమలుకు తొలుత గత ఏడాది సెప్టెంబరు 12న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు దామోదర్ రాజ నరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి సభ్యులుగా మం త్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చే సింది.
అనంతరం అక్టోబరు 11న రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చే స్తూ జీవో నంబర్ 8ని విడుదల చేసింది. వర్గీకరణపై సమగ్రంగా అధ్యయనం చేసిన కమిషన్.. 2011 జనాభా లెక్కల ప్రకారమే వర్గీకరణ ప్రక్రియను నిర్వహించిం ది. ఫిబ్రవరి మూడో తేదీన మం త్రివర్గ ఉప సంఘానికి తన నివే దికను అందించింది.ఎస్సీ ఉప కులాల్లో ఎవరిని ఏ గ్రూపులో చే ర్చాలన్న అంశంపై సొంత నిర్ణయం వద్దని, ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసిన దానికే కట్టుబడి ఉందామని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి ముందు మంగళవారం కమిటీ హాల్లో క్యాబినెట్ సమావేశమైంది. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికను అందులో ప్రవేశపెట్టారు.
అనంత రం దానిపై సుదీర్ఘంగా చర్చ జరిగిం ది. మొదటి గ్రూప్‌లో 15 కులాల ను, రెండో గ్రూప్‌లో 18, మూడో గ్రూప్‌లో 26 కులాలను చేర్చాలని కమిషన్ సిఫార్సు చేసింది. వీటిలో ఏ కులాన్నైనా ఒక గ్రూపు నుంచి మరో గ్రూపునకు మార్చాలా? అన్న దానిపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. అయితే, ఈ అంశంలో వేలు పెట్టకూడదని, ఏకసభ్య కమిషన్ సిఫార్సుకే కట్టుబడి ఉండాలని చివరకు నిర్ణయించింది.
ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్టీ లు… రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో మంగళవారం ప్రవేశపెట్టిన సమ గ్ర కులగణన నివేదికలోని పూర్తి వి వరాలు ఎప్పుడు తెలుస్తాయా అని రాజకీయ పార్టీలు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. కులగణన నివేదిక లో రాష్ట్రంలో ఉన్న కులాలు, వాటి జనాభా, శాతం వివరాలను మాత్ర మే ప్రభుత్వం వెల్లడించింది. ఏ కులం వారికి ఎంతమేర అవకాశా లు దక్కాయనే వివరాలను బయ టపెట్టలేదు. అయితే కులాల వారీ లెక్కలను కూడా అవసరమైతే బయటపెడ తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అన్నారు.
ఆ నివేదిక కూడా బయటకు వస్తే రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల్లోని వారికి ఎవ రెవరికి ఎంతమేర ఉద్యోగాలు సహా వివిధ అంశాల్లో లబ్ధి జరిగిందన్నది తెలియనుంది. కాగా బిహార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన చేప ట్టింది. ఆ తరువాత పూర్తి నివేది కను బహి ర్గతం చేసింది. తొలుత మొత్తం జనాభా వారీగా, బీసీల వివరా లను వెల్లడించింది. ఆ తరువాత పూర్తి నివేదికను ప్రజల ముందు ఉంచింది. ఈ క్రమంలోనే తెలం గాణలోనూ పూర్తి నివేదికను ప్రజల ముందు ఉంచితే అన్ని వివరాలపై స్పష్టత వస్తుందనే చర్చ జరుగు తుంది. రాష్ట్రంలో బీసీల్లోనూ ఏ, బీ, సీ, డీ, ఈలుగా పలు కేటగిరీలు న్నాయి. వీటిల్లో ఎవరు ఎక్కువ జనాభా కలిగి ఉన్నారు .
ఏ కులం వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు నివేదిక బహి ర్గతమైతే తేలనున్నాయి. అందులోని అన్ని వివరాలను ప్రభుత్వం బయటపె ట్టకపోవడంతో ఈ అంశం చర్చ నీయాంశంగా మారింది. అయితే క్యాబినెట్ ఆమోదం తర్వాత జస్టి స్ షమీమ్ అక్తర్ నివేదికను మంగ ళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. నివేదికలోని సిఫారసుల ప్రకారం ఎస్సీలను మూడు గ్రూపులుగా వర్గీకరిస్తు న్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ఆయా వర్గాలు, జనాభా, సామాజిక, ఆర్థిక, విద్య తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మొత్తం 59 కులాలను వర్గీకరించినట్లు తెలిపింది.
దాని ప్రకారం.. అత్యంత వెనకబడిన 15 కులాలను గ్రూప్–1గా పేర్కొంది. ఎస్సీల్లో వారి జనాభా 3.288 శాతం. వీరికి 1 శాతం రిజర్వేషన్ కేటాయిస్తు న్నట్లు ప్రకటించింది. ఇక, మాదిగ, 18 ఉప కులాలను గ్రూప్–2గా పేర్కొంది. వాటి జనాభాను 62.748 శాతంగా పేర్కొంది. ఈ కులాల్లో ఒక్క మాదిగల జనాభా శాతమే 61.967 శాతం (32,33,642)గా పేర్కొంది. ఈ గ్రూపులోని మాదిగ, ఉప కులాలకు 9 శాతం రిజర్వేషన్‌ను ఖరారు చేసింది. ఇక, మాల, 26 ఉప కులాలను కలిపి గ్రూప్–3గా వర్గీకరించింది. ఎస్సీల్లో వారి జనాభాను 33.963 శాతంగా పేర్కొంది. వీరిలోనూ ఒక్క మాలల జనాభానే 29.265 శాతం (15,27,143)గా వివరించింది. మాల, ఇతర ఉప కులాలకు కలిపి 5 శాతం రిజర్వేషన్‌ను కేటాయించింది.
క్రీమీలేయర్‌కు నో…. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్‌తో పాటు క్రీమీలేయర్ విధానాన్ని కూ డా అమలు చేయాలని ఏక సభ్య కమిషన్ సిఫారసు చేసింది. దీనితో కలిపి మొత్తం నాలుగు సిఫారసు లు చేసింది. వీటిలో క్రీమీలేయర్ మినహా మిగిలిన మూడు సిఫార సులను ప్రభుత్వం ఆమోదించింది. క్రీమీలేయర్ సిఫారసును ప్రభుత్వం తిరస్కరించింది. క్రీమీలేయర్ అంటే ఇప్పటికే వివిధ రంగాలు, వివిధ రూపాల్లో రిజర్వేషన్ల లబ్ధి పొందిన వారి రెండో తరానికి ఆ ప్రయోజనాన్ని మినహాయించడం. దీని ప్రకారం.. ఎమ్మెల్యేలు, ఎంపీ లు, జడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లు సహా ప్రజా ప్రతినిధులతోపాటు గ్రూప్–1 సర్వీసుల్లో ఉన్న వారిని క్రీమీలేయర్‌గా పరిగణించాలని సూచించింది.
ఈ వ్యక్తుల రెండో తరం రిజర్వేషన్ల ప్రయోజనం పొందకుండా మినహాయించాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించిం ది. దీనిని ప్రభుత్వం తిరస్కరిం చింది. ఇక, నివేదికలోని రెండో సిఫారసు.. ఉద్యోగ ఖాళీల భర్తీల్లో ప్రాధాన్య క్రమాన్ని పాటించడం. దీని ప్రకారం.. ఉద్యోగ ఖాళీల భర్తీ క్రమంలో గ్రూప్–ఐలో గుర్తించిన కులాలతో ఆ ఖాళీలు భర్తీకాక పోతే.. వాటిని తదుపరి ప్రాధాన్య గ్రూప్ అయిన రెండో గ్రూప్‌లోని కులాల ద్వారా భర్తీ చేయాలి. అప్పటికీ ఆ పోస్టులు భర్తీ కాక పోతే.. ఆ తర్వాత ఉన్న గ్రూప్ –3లోని కులాల ద్వారా భర్తీ చేయాలని సిఫారసు చేసింది. ఒక వేళ, మూడు గ్రూపుల్లో తగిన అభ్యర్థులు లేకపోతే వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలని పేర్కొంది. మూ డో సిఫారసు కింద.. ఈ మూడు గ్రూపుల వారికీ రోస్టర్‌లను సూచించింది.
దాని ప్రకారం గ్రూప్–1కు 7 రోస్టర్ పాయింట్లు, గ్రూప్–2లో ఉన్నవారికి 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97 పాయింట్లను, గ్రూప్–3లో ఉన్న వారికి 22, 41, 62, 77, 91 చొప్పున రోస్టర్ పాయింట్లను ప్రతిపాదించింది. వర్గీకరణ అమలుకు ప్రభుత్వం త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్.. రిజర్వేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఎస్సీ ఉప కులాలను మూడు భాగాలుగా వర్గీకరిస్తూ రాష్ట్ర శాసనసభ, మండలి మంగళవారం ఆమోదించిన తీర్మానం ఆధారంగా దీనిని విడుదల చేయనుంది. వర్గీకరణ అమలుకు మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. అది పూర్తయిన వెంటనే గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ ప్రక్రియకు వారం, పది రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఆ తర్వాత.. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకూ కసరత్తు జరుగుతోంది. ఈ కసరత్తు పూర్తై నోటిఫికేషన్లు విడుదలైతే.. పాతికేళ్ల తర్వాత రిజర్వేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలవుతున్న ఉద్యోగాలు ఇవే కానున్నాయి. గాంధీ భవన్‌లో సంబరాలు.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మా నం ఆమోదం పొందుతున్న సమ యంలో గాంధీ భవన్‌లో మంగళ వారం పెద్ద ఎత్తున సంబరాలు జరి గాయి. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఆధ్వ ర్యంలో జరిగిన ఈ సంబ రాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కు మార్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్, మాజీ మంత్రులు చంద్రశేఖర్, పుష్పలీల తదితరులు పాల్గొన్నారు.
బాణసంచా కాల్చి, సీ ట్లు పంచుకున్నారు. డప్పు వాయి ద్యాలతో గాంధీభవన్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మా ట్లాడారు. ఎస్సీ వర్గీకరణ, కులగణ న కాంగ్రెస్ మార్కు విజయాలన్నా రు. ఎస్సీలు, బీసీల కోసం పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో కేటీఆర్, హరీశ్ రావు సమాధానం చెప్పాలన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీసు కున్న నిర్ణయం పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. కాగా, కుల గణన సర్వే నివేదికను శాసనసభ లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పార్టీ బీసీ నేతలూ గాంధీ భవన్‌లో సంబ రాలు జరుపుకొన్నారు. ఈ కార్య క్రమంలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.