Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

AssemblyBRSjagdishreddy : అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి జగడం

--సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ --ప్రతిపాదించిన మంత్రి శ్రీధర్ బా బు --నిర్ణయం తీసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ --ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎ మ్మెల్యేలు

అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి జగడం

–సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్
–ప్రతిపాదించిన మంత్రి శ్రీధర్ బా బు
–నిర్ణయం తీసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
–ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎ మ్మెల్యేలు

AssemblyBRSjagdishreddy:   ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు భగ్గుమ న్నాయి. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే జగదీశ్ రెడ్డిపై బడ్జెట్ సెషన్ ముగిసే వరకు సస్పెన్షన్ వేటు పడింది. స్పీకర్ చైర్ ను అవ మాన పర్చేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రిపై వేటు వేయాలని ప్ర తిపాదిస్తూ శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదంతో స్పీకర్ నిర్ణయాన్ని అమలు చేశారు.

గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసం గానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై చర్చ ప్రారంభమైంది. ఈ సంద ర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ ను ఏకవచనంతో నువ్వు అ ని సంబోధించారని పేర్కొంటూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ఈ క్ర మం లో జగదీశ్ రెడ్డి ‘సభ మీ సొంతం కాదు సభఅందరిదీ కాదు స భకు మీరు పెద్ద మనిషి మాత్రమే’ అని స్పీకర్ ను ఉద్దేశించి వ్యాఖ్య చేశారు. దళిత స్పీకర్ ను కావాలని అవమానించారని పేర్కొంటూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. 15 నిమిషాల పాటు వాయిదా వేస్తు న్నట్టు ప్రకటించిన స్పీకర్ తన చాంబర్ కు వెళ్లిపోయారు.

సభ వాయిదా పడిన మూడున్నర గంటల తర్వాత తిరిగి ప్రారంభ మైంది. ఈ సందర్భంగా కాం గ్రెస్, బీజేపీ మధ్య వివాదం కొనసా గిం ది. స్పీకర్ ను ఏక వచనంతో మాట్లాడటం బాధాకరమని మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ యన అహంకారం తోవ్యవహరిం చార ని చెప్పారు. అసెంబ్లీ ఎథిక్ కమిటీకి రెఫర్ చేసి తగిన చర్యలు తీసు కోవాల నికోరారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మా ట్లాడు తూ అందరం సభా మర్యా దలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. సభా పతి హక్కుల ను కాపాడటం అందరి బాధ్యతని అన్నా రు. సభను నడిపే సర్వ హ క్కులు స్పీకర్ కు భారత రాజ్యాంగం క ల్పించిందని గుర్తు చేశారు.

స్పీకర్ ను ఏక వచనం తో మాట్లాడడం చాలా బాధ కలిగించాయ న్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అం దరూ జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని కోరారని, ఎథిక్స్ కమి టీకి పంపి నిర్ణయం తీసుకుం టామని చెప్పారు. శాసన సభా వ్యవహా రాల శాఖ మంత్రి శ్రీధర్ బా బు మాట్లాడుతూ ఉదయం జరిగిన సంఘటన దురదృ ష్టకరమన్నా రు. స్పీ కర్ స్థానాన్ని అవమాన పర్చడమే నని, సభా మర్యాదలు పా టించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడి మీదా ఉందన్నారు. రూల్ బుక్ ఆధారం గానే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయా లని ప్రతిపాదించారు.