-పశుగ్రాస కొరత నివారణకు ప్రభుత్వ ముందుచూపు : పెంటయ్య
Assistant Director Dr. Pentaiah : ప్రజా దీవేన, కోదాడ: రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పశుగ్రాస నివారణ దృష్టిలో ఉంచుకొని సబ్సిడీపై విత్తనాలను కోదాడ పశు వైద్యశాలలో విక్రయిస్తున్నామని కోదాడ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి లో వర్షాలు లేక , పచ్చిక బయళ్లలో పచ్చిక ఎండిపోయి భూములన్నీ బీడు పడి పశువులకి గ్రాసం కొరత ఏర్పడుతుందని తెలిపారు ఎండుగడ్డి ధరలు కూడా పైపైకి పెరిగిపోతున్నాయని పశుగ్రాస కొరతను అధిగమించి పశుపోషకులు తమ పశువువలకి పచ్చి మేత అందించడం కోసం,నీటి వనరులున్న చోట మేలు జాతి పశుగ్రాసం పెంపకానికి 75 శాతం సబ్సిడీ పై అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గడ్డిజొన్నలు అన్ని పశువైద్యశాలకి శుక్రవారం ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు
కిలో ఒక్కంటికి 98.89 రూపాయలు విలువగల పశుగ్రాస విత్తనాలను అవసరం ఉన్న రైతులకు 75 శాతం సబ్సిడీ పై 24.70 రూపాయలకే అందించటం జరుగుతుందని తెలిపారు
కోదాడ మరియు హుజూర్నగర్ నియోజక వర్గాలకు 2750 కిలోల విత్తనాలను విక్రయించేందుకు కోదాడ పశు వైద్యశాలలో నిల్వ ఉన్నాయని కోదాడ హుజూర్నగర్ ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అలాగే నీటి వనరులున్న రైతులు, రబీ పంట కోయగానే ఆ తేమలోనే పశుగ్రాస విత్తానాలు చల్లుకుంటే మరో రెండు తడుల్లో బలమైన పచ్చిమేత వస్తుందని ఎకరానికి సరాసరి మూడు కోతల్లో 150-200 క్వింటాళ్ల టన్నుల పచ్చిమేత దిగుబడి అవుతుందని పశుగ్రాసాన్ని విరివిగా సాగుచేసుకొని తమపశువులకి బలమైన పచ్చిమేత అందించాలని సూచించారు