–సోషల్ మీడియా పట్ల అప్రమ త్తం గా ఉండాలి
–అపరిచిత వ్యక్తుల పట్ల ఏమరు పాటుతో మెలగాలి
–బాల బాలికలకు షి టీం కౌన్సి లింగ్
Eve-Teasing Awareness : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఈవ్ టీజింగ్ పట్ల బాల బాలికలలో అవ గాహన పెంపొందించాలని షిటీం ఏ ఎస్ ఐ రాంరెడ్డి పేర్కొన్నారు. నల్ల గొండ షిటీం ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఆదేశానుసారం శుక్రవారం ఉద యం పానగల్ రోడ్ సమీపంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగ ణంలో ఈవ్ టీజింగ్ పై షి టీం సి బ్బంది కౌన్సిలింగ్ నిర్వహించారు.షి.టీం ఏ ఎస్ ఐ యాట రాంరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ నరసింహ, ఉమె న్ హెచ్.సి లక్ష్మీ పాఠశాల హెడ్ మా స్టర్ యాదగిరితదితరులు ఈ కౌన్సె లింగ్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షి టీం ఏ ఎస్ ఐ రాంరెడ్డి మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల ఏమరుపాటుగా ఉం డడంతో పాటు సోషల్ మీడియా ప ట్ల అప్రమత్తంగా ఉండాలని ఉద్బో ధించారు.అత్యవసర పరిస్థితుల్లో షి టీం ను సంప్రదించాలని ఆయన తెలిపారు.
బాల బాలికల తో పాటు మహిళల పరిరక్షణ కోసం ఆవిర్భావించిన షి టీం అన్ని వేళల మహిళల పరిరక్ష ణకు అండగా ఉంటుందని రాంరెడ్డి తెలిపారు.