Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District Collector Ila Tripathi : నానో యూరియా పై అవగాహన సదస్సులు 

–జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి

District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : జిల్లాలో సాధారణ యూరియా తో పాటు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వినియోగించేందుకు రైతులకు అగ్రికల్చర్ సైంటిస్టులు, ఆఫీసర్లు అవగాహన కల్పిస్తున్నారని జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి తెలిపారు. లిక్విడ్ రూపంలో ఉండే నానో యూరియాలోనూ యూరియాతో సమానమైన నత్రజని ఉంటుందని, పైగా దీని రవాణా, నిల్వ, వినియోగం కూడా సులభంగా ఉండడమే కాకుండా రైతులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పారు. మార్కెట్లో రిటైల్ డీలర్లు , సహకార సంఘాల వద్ద ఈ యూరియా అందుబాటులో ఉందని, లీటరు నీటిలో 4 ఎంఎల్ నానో యూరియాను కలిపి స్ప్రే చేయాలి. డ్రోన్ ద్వారా వినియోగిస్తే 10 లీటర్ల సామర్థ్యం ఉంటే 250 ఎంఎల్, 20 లీటర్ల సామర్థ్యం ఉంటే 500 ఎంఎల్ సరిపోతుందని, పంట వేసిన తర్వాత మొదట సాధారణ యూరియా, డీఏపీ గానీ వాడాలని, పిలకలు వచ్చే దశ నుంచి నానో యూరియా స్ప్రే చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నట్లు తెలిపారు. పత్తి, కంది వంటి పంటలకు దుక్కుల సమయంలోనే సాధారణ యూరియా వాడి, తర్వాత నానో యూరియా స్ప్రే చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. నానో యూరియా చిన్న డబ్బాల్లో ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. వివిధ కంపెనీకి చెందిన నానో యూరియా మార్కెట్‌లో రిటైల్ డీలర్లు మరియు సహకార సంఘాల వద్ద అందుబాటులో ఉంది.

 

యూరియా బస్తా రేటు రూ.270 కాగా, అర లీటర్ నానో యూరియా రూ.225కు లభిస్తుంది. ఇది ఎకరం పంటకు సరిపోతుంది. ఐదేండ్ల కింద 94 రకాల పంటలపై 11 వేల ఫీల్డ్ ట్రయల్స్ ద్వారా నానో యూరియాను పరీక్షించారు. దీని వాడడం వల్ల సాధారణ యూరియాతో పోలిస్తే 8 శాతం ఎక్కువ దిగుబడి వచ్చినట్టు తేలింది. తెలంగాణ జయశంకర్ అగ్రికల్చర్వర్సిటీ, ఐకార్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ స్టడీల్లోనూ ఇవే ఫలితాలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా నానో యూరియాను 1985లో ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్‌లో చేర్చింది. నానో యూరియా వాడడం ద్వారా యూరియా వినియోగాన్ని 25- నుంచి 40 శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ, రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ఎలా స్ప్రే చేయాలో ప్రాక్టికల్‌గా చూపిస్తున్నారు. ఆయా కార్యక్రమాల ఫలితంగా రైతులు క్రమంగా నానో యూరియా వైపు మొగ్గు చూపుతున్నారు.

 

–కాలుష్యాన్ని తగ్గించి…

 

45 కిలోల యూరియా బస్తాకు 500 ఎంఎల్ నానో యూరియా సమానం. రేటు కూడా దాదాపు సమానమే. పంటల మీద యూరియా చల్లితే సగం నత్రజని మాత్రమే మొక్కలకు చేరుతుంది. మిగిలిన యూరియా నేల, నీటిలో కలిసి కాలుష్యాన్ని పెంచుతుంది. అదే నానో యూరియాను స్ప్రే చేయడం ద్వారా నత్రజని నేరుగా మొక్కలకు చేరుతుంది. ఇది కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా 8 శాతం వరకు దిగుబడి పెంచుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అన్ని రకాల పంటలకు నానో యూరియా వాడుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పేర్కొంటున్నారు.

 

–అధిక దిగుబడి ఇస్తుంది..

 

నానో యూరియా వాడకంతో వరి, కూరగాయల పంటల్లో మంచి దిగుబడి వస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. నానో యూరియాను మొక్కలు బాగా గ్రహించడంతో ఫలితాలు వెంటనే కనిపిస్తున్నాయి.ఇప్పటివరకు జిల్లాలో రైతులు 24000 లీటర్ల నానో యూరియా కొనుగోలు చేసి వాడినారు, ఇంకా నలభై వేల లీటర్ల నానో యూరియా అందుబాటులో ఉంది.