–రూ.50 లక్షల విలువైన ప్రొజెక్టర్ లైట్స్, వేలాది వెదురు బొంగులు చోరీ
–ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన చోరీ సమాచారం
Ayodhya: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: అయోధ్య (Ayodhya) లో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎంతో వేడుకగా జరి గింది.ఐదువందల ఏళ్లనాటి కల దే శ ప్రధాని మోదీ చేతుల మీదుగా సాకారమైంది. ఈ వేడుకకు మన దేశంనుంచి సామాన్యులతో పాటు, అన్నిరంగాలకలు చెందిన ప్రముఖు లు హజరయ్యారు. అందరికి రామ జన్మభూమి ఆలయం ట్రస్ట్ ప్రత్యేకం గా ఆహ్వానాలు అందించింది. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఆలయం (Temple in Ayodhya)పరిసర ప్రాంతంలో జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరిగిన ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఇదిలా ఉం డగా అయోధ్యలో ప్రస్తుతం జరిగిన చోరీ అందరిని షాకింగ్ కు గురిచే స్తుంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో సర్వాంగ సుం దరగా, కాంతులు వెదజల్లే ప్రత్యే కమైన లైట్లను ఏర్పాటు చేశారు. రామమందిరంకు దగ్గరలో ఉన్న.. భక్తిపథ్, రామ్ పథ్‌లో ఏర్పాటు చేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు.
ప్రొజెక్టర్ లైట్స్‌తో (Projector lights) పాటు వేలాది వెదురు బొంగులు చోరీకి గుర యినట్టు పోలీసులు గుర్తించారు. వీటి విలువ రూ.50 లక్షలు ఉంటుందని సమాచారం. మరో వైపు నిరంతరం భద్రత, హై సెక్యు రిటీ (Security, high security)ఉండే ప్రాంతంలో ఈ చోరీ జర గడంతో అధికారులు సైతం షాక్ కు గురౌతున్నారు. దాదాపు 4 వేల లై ట్స్‌ని దొంగలు ఎత్తుకుపోయారని సమాచారం. ఈ ఘటనపై రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లోప పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆగస్టు 9వ తేదీన కేసు నమోదుచేసినట్టు పోలీసులు వెల్ల డించారు.లైటింగ్ ఏర్పాటు చేస్తోన్న కాంట్రాక్ట్ సంస్థలు ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు (Registration of case)చేసినట్లు తెలుస్తోం ది. రామ్‌పథ్‌లో దాదాపు 6,400 బ్యాంబూ లైట్లు, భక్తి పథ్‌లో 96 ప్రొజెక్టర్ లైట్స్ సెట్లను అమర్చారు. మార్చి 19వ తేదీ వరకూ ఉన్న ఇవి.. తర్వాత కనిపించకుండా పో యాయి. మే 9న అక్కడ అధి కారులు తనిఖీలు నిర్వ హించగా ఈ లైట్లు కనిపించలేదు. మొత్తం 3,800 బిగ్ లైట్స్, 36 ప్రొజెక్టర్ లైట్స్‌ని దొంగిలించారు. మూడు నెలల కిందటే చోరీని గుర్తించి నప్పటికీ ఆగస్టు 9వ తేదీన FIR నమో దుచేయడం ప్రస్తుతం సంచల నంగా మారింది.