ప్రజా దీవెన అయోధ్య: ప్రపంచం లో ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ప్రాచుర్యం అంతా ఇంకా కాదు. తాజ్ మహల్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు ప్రఖ్యాతలు కూడా అంతా అంతా కాదు. ప్రధానంగా మన దేశ ప్రజలు మాత్రం ప్రతి ఒక్కరు తాజ్ మహల్ సందర్శించాలన్న కుతూహలాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంటారు.
దీంతో తాజ్ మహల్ ఎన్నో రికార్డులను తన ఖాతాలో సొంతం చేసుకుంది. అటువంటి తాజ్‌మ హల్ రికార్డు అయోధ్య రామమం దిరం బద్దలు కొట్టిoది. 2024 జన వరి నుంచి సెప్టెంబర్ వరకు 13.55 కోట్ల మంది భారతీయులు అయో ధ్యను సందర్శించినట్లు ఉత్తర్‌ప్రదే శ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. వీరి తో పాటు 3153 మంది విదేశీ పర్యాటకులు అయోధ్య క్రమం తప్పకుండా సందర్శిస్తున్నారు.
తాజ్‌మహల్‌ను దేశీయ, అంతర్జా తీయ పర్యాటకులు కలిపి 12.51 కోట్ల మంది సందర్శించినట్లు వెల్లడి కాగా కేవలం 9 నెలల్లోనే తాజ్‌మ హల్ రికార్డును అయోధ్య రామ మందిరం అధిగమించినట్లు యూపీ సర్కార్ స్పష్టం చేసింది. దీంతో త్వరలోనే ప్రపంచ అద్భుతాలలో అయోధ్య రామ మందిరం చేరే అవకాశం లేకపోలేదని సామాజికవేత్తలు భావిస్తున్నారు.