Ayodhya Temple: ప్రజా దీవెన, అయోధ్య: అయోధ్య ఆలయంలో రామ్ లల్లా ప్రతిష్ఠాప నకు ఏడాది పూర్తవుతున్న సంద ర్భంగా అద్భుతఘట్టం ఆవిష్కరిo చేందుకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఉత్సాహంగా ఉల్లాసంగా ముందు కు సాగుతోంది. జనవరి 11వ తేదీన ముఖ్యమంత్రి యోగి ఆది త్యనాథ్ అయోధ్య రామ్ లాల కు అభిషేకం జరిపించే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా ద్వాదశి వార్షి కోత్సవాలు 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు కొన సాగనున్నాయి. ఇందులో భాగంగా రామాలయం సమీపంలోని ‘అంగ ద్ తిల’లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని సీఎం యోగి ఆది త్యానాద్ ప్రారం భించను న్నారు.
ప్రముఖ గాయకుల భక్తి గీతాల రికార్డును కూడా ఆయన విడుదల చేస్తారని అధికారులు చెప్పారు. అంతేకాకుండా, అయోధ్యలోని లతా చౌక్, జన్మభూమి పథ్, శ్రిం గార్ హాట్, రామ్ కీ పైడీ, సుగ్రీవ ఫోర్ట్, చోటి దేవ్కాళి ప్రాంతాల్లో యువ కళాకారులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గీతా లాపన వంటి వి ఉంటాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. ఆలయ గర్భగుడి వద్ద ‘శ్రీరామ్ రాగ్ సేవ’కా ర్యక్రమం కూడా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సింది గా దేశ వ్యాప్తంగా ఉన్న సాధువు లు, భక్తులకు ఆహ్వానాలు పంపా మని వెల్లడించారు.