Babu Jagjivan Ram Vardhanthi :ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: భారత ఉపప్రధాని, నవభారత నిర్మాత బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు నల్గొం డ పట్ట ణంలో అత్యంత ఘనంగా జరిగా యి. సోమవారం నాగార్జున డిగ్రీ కళాశాల సమీపంలోని ఆయన విగ్రహం వద్ద ‘మహనీయుల ఆశయ సాధన సమితి (మాస్)’, ‘జగ్జీవన్ రామ్.. అంబేద్కర్ భవన అభివృ ద్ధి కమిటీ’, ‘అంబేద్కర యు వజన సంఘం’, ‘మాదిగ JAC’ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వ హించారు.ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన నేత లు, అధికారుల ప్రసంగాలు జిల్లా రాజకీయాల్లో సరికొత్త వేడిని రగిల్చాయి.

ఈ నివాళి సభ కేవలం స్మరణకే ప రిమితం కాకుండా రాబో యే రోజు ల్లో జిల్లాలో రాబోతున్న ఒక పెద్ద రాజకీయ, సా మాజిక మార్పునకు నాంది పలికింది. కేవలం ఒకే వర్గానికి చెందిన ఇద్దరి ఆగడాలతో ఇ క్కడి ప్రజలు పూర్తిగా విసిగిపో యారు. వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గ రపడ్డాయి. త్వరలో నే నల్గొండ ఎన్ జీ కళాశాల మైదానంలో భారీ ఎత్తున ‘దళి త బహుజన సభ’ను నిర్వహించి మా సత్తా చాటుతామని మాస్ రాష్ట్ర అధ్యక్షులు పె రి క కరణ్ జయరాజ్, భవన అభివృద్ధి కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్ లు ప్రకటించారు.
కదిలివచ్చిన యంత్రాంగం,మేధావులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అడిషనల్ ఎస్పీ ర మేష్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శశి కళ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవ లను కొనియా డారు. అనంతరం స్థానిక అంబేద్కర్ జగ్జీవన్ రామ్ భవనం లో భవన అభివృద్ధి కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్ ఆధ్వ ర్యంలో నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి మరోసారి ఘ న నివాళులు అర్పించారు. దళిత సంఘాల నా యకులు, ప్రజాప్రతినిధులు, మేధా వులు, న్యాయవాదులు మరియు విద్యార్థి సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

గౌరవ అధ్యక్షులు కత్తుల షణ్ముఖ కుమార్, జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్, ఉపాధ్యక్షులు పెరిక ఉమామహేశ్వర్, పెరిక రమేష్, ప్రధాన కార్యదర్శి కందుల లక్ష్మయ్య, ఉపాధ్య క్షులు కొప్పోలు అ శోక్, వట్టపు శ్రవణ్, చింత శివరా మకృ ష్ణ, జడ్పీటీసీ మాజీ కో-ఆప్ష న్ సభ్యులు తీగల జాన్ శాస్త్రి, మై నం విక్రమ్, దళిత సంఘాల ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిదల నవీ న్ కుమార్, కార్పొరేటర్ లు పెరిక యాదయ్య, బొజ్జ శంకరయ్య, స్వా తి రాజశేఖర్, దీప్లా నాయక్, పట్ట ణ అధ్యక్షులు ఇరిగి ప్రసాద్, ప్రధా న కార్యదర్శి కత్తుల సన్నీ, ఉపా ధ్యక్షులు పెరిక హరిప్రసాద్, చిట్టి పెరిక అంజయ్య, పేర్ల నరేందర్, ప గడాల శివ, బొజ్జ సైదులు, బొజ్జ పాండు, కుడు తల నాగరాజు, మాతంగి లింగస్వామి తదితరులు ఈ ఘన నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు.