Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Badlapur Railway Station: శృతిమిoచుతోన్న కామవాంఛ

–మూడు, నాలుగేళ్ల చిన్నారులపై పాఠశాల అటెండర్ పైశాచికానందం
–విషయం పొక్కడంతో పెల్లుబికిన జనాగ్రహం
–మహారాష్ట్రను కుదిపేస్తున్న బద్లా పూర్‌ సoఘటన వైనం
–దాదాపు ఎనిమిదిగంటల పాటు రైల్వే ట్రాక్‌పై ఆందోళన పర్వం
–నిందితుడిని ఉరి తీయాలంటూ పెల్లుబికిన అగ్రహవేశం

Badlapur Railway Station: ప్రజా దీవెన, ముంబై: దేశంలో కామాంధులో కామవాంఛ రోజు రోజు కు శృతి ముంచుతోంది. వాయి వ రుస తేడా లేకుండా వయస్సుతో నిమిత్తం లేకుండా తమ కామవాంఛ తీర్చుకునేందుకు వెనుకాడడం లే దు. ఈ క్రమం లోనే అన్నెం పు న్నెం ఎరుగని మూడు, నాలుగేళ్ల వయ సున్న (Three and four year old Sunna)ఇద్దరు చిన్నారులపై పాఠశా ల టాయిలెట్‌లో ఓ అంటెండెంట్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో మహా రాష్ట్రను ఓ కుదుపు కుదిపేస్తోంది. వందలాది మంది తల్లిదండ్రులు, ప్రజలు దాదాపు ఎనిమిది గంటల పాటు థానే జిల్లా బద్లాపూర్‌ రైల్వే స్టేషన్‌లో పట్టాలపై బైఠాయించారు.

రైళ్ల రాకపోకలను అడ్డుకోవద్దని, రైల్వే ట్రాక్‌లను Railway track) ఖాళీ చేయాలని ప్రభుత్వం ఎంత విజ్ఞప్తి చేసినా లెక్కచేయకుండా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని, అరెస్టు చేసిన నిందితుడిని ఉరి తీయాల్సిందేనంటూ నినదించారు. ‘హ్యాంగ్‌… హ్యాంగ్‌’ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ ఆందోళనతో అంబర్‌నాథ్‌–కర్జత్‌ సెక్షన్‌లో లోకల్‌ రైళ్లు నిలిచిపో యాయి. 15 దూర ప్రాంత రైళ్లను దారి మళ్లించారు. వారిని శాంతింప జేసేందుకు మధ్యాహ్నం మహారా ష్ట్ర మంత్రి గిరీశ్‌ మహాజన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదులను తీసుకో వడంతో నిర్లక్ష్యం వహించిన పోలీ సు అధికారులను సస్పెండ్‌ చేశామ ని, నిందితుడిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిర సనకారుల డిమాండ్లకు అనుగుణం గా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుం టోందన్నారు. రైళ్లు రద్దవ్వడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పినా ఆందోళనను విరమించలేదు.

సాయంత్రం నిరసనకారులను ఖాళీ చేయించేందుకు పోలీసులు లాఠీ చార్జీ (Police baton charge)చేశారు. ప్రతిగా నిరసనకా రులు రాళ్లు రువ్వారు. ఎట్టకేలకు 6.15 గంటల సమయంలో రైల్వే ట్రాక్‌ను క్లియర్‌ చేయగలిగారు. దాదాపు పది గంటల తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రైల్‌ రోకోకు దిగడానికి ముందు మహిళలతో సహా వందలాది మంది నిరసనకారులు ఆ పాఠశాల వద్దకు వెళ్లారు. కొందరు పాఠశాల గేట్లను బద్దలుకొట్టి లోపలికి వెళ్లి.. తలుపులు, కిటికీలు, బెంచీలను (Doors, windows, benches) విరగ్గొట్టారు.మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లోని ఓ పేరున్న పాఠశాలలో ఈ నెల 13న ఈ ఘోరం జరిగింది. పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న అక్షయ్‌ షిండే అనే వ్యక్తి అక్కడ చదువుతున్న ఇద్దరు చిన్నారులపై టాయిలెట్‌లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత వారిలో ఓ చిన్నారి నొప్పితో బాధపడుతుం డడంతో తల్లిదం డ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో ఆ చిన్నారి ప్రైవేటు భాగాలకు (Private parts) గాయమైనట్టు తెలిసింది. అలాగే మరో చిన్నారి బడికి వెళ్లడానికి భయపడుతుండడంతో తల్లిదం డ్రులు ఆరా తీయగా ఆ స్వీపర్‌ అఘాయిత్యం బయటపడింది. ఈ దారుణంపై ఫిర్యాదు చేసినా పోలీసులు వెంటనే స్పందించలేదని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తు న్నారు.

ఈ నెల 17న నిందితుడిని అరెస్టు చేసి, ‘పోక్సో’ చట్టం (POCSO Act)కింద కేసు నమోదు చేశారు. పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్‌ను, కొందరు సిబ్బందిని సస్పెండ్‌ చేసింది. అయితే ఆ పాఠశాలలో మహిళా అటెండెంట్లు లేకపోవడమే కాదు, సీసీటీవీ కెమెరాలు పనిచేయ డం లేదని పోలీసుల విచారణలో తేలింది. పాఠశాల నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. పాఠశా ల యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదం డ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయ త్నించిన పాఠశాల ప్రిన్సిపాల్‌, సిబ్బందిని వదిలిపెట్టకూడదని పట్టు బడుతున్నారు. ఈ ఘటనపై మహిళా ఐపీఎస్‌ అధికారిణి ఆర్తి సింగ్‌ నేతృత్వంలో విచారణకు ఆదే శించినట్లు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. కేసు విచార ణ వేగంగా జరిగేలా నిందితుడికి ఉరి శిక్ష పడేలా చూస్తామని మహా రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే హామీ ఇచ్చారు.