–పదవీ విరమణలో పంచాయతీ రాజ్ శాఖ సిఈ తిరుపతయ్య
Banda Venkateshwara Reddy: ప్రజా దీవెన నల్లగొండ టౌన్: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో బండా వెంకటేశ్వర రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని పంచా యతీరాజ్ శాఖ చీఫ్ ఇంజనీర్ తిరుపతయ్య అన్నారు. సోమవా రం పంచాయతీరాజ్ శాఖలో 41 సంవత్సరాలు సేవ చేసి డిప్యూటీ ఈ ఈ గా పదవి విరమణ పొందిన వెంకటేశ్వర రెడ్డి సన్మాన కార్యక్రమా నికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా పంచాయతీరాజ్ శాఖలో ఎలాంటి మచ్చ లేకుండా ఎందరో మండల పొందిన వెంకటేశ్వర రెడ్డి సేవలు మరువలేనివని అన్నారు. అనంతరం వెంకటేశ్వర రెడ్డి విజిత దంపతులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఇ రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాసరెడ్డి,రిటైర్డ్ ఎస్ ఇ దయాకర్ రెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ ఇ ఇ తేరా భాస్కర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు దీపక్ వినోద్ రఘుపతి గిరిధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ దంపతులుబుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ గు మ్మల మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, జిల్లా పరిషత్ మినిస్ట్రీస్ ఉద్యోగుల సంఘం నాయకులు సత్యనారాయణ రెడ్డి, రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి దంపతులను ఘనంగా సన్మానిం చారు.