Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bandi Sanjay: కాంగ్రెస్ లోనే బిఆర్ఎస్ విలీనం

–స్పష్టమైన సంకేతాలు మాకూ ఉన్నాయి
–కవిత బెయిల్ తో మా పార్టీకి ఏం సంబంధం
–ఆప్ విలీనంతోనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా
–సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేం ద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం

Bandi Sanjay: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: అతి త్వర లోనే కాంగ్రెసలో బీఆర్ఎస్ విలీనం (Merger of BRS with Congress) కానుంది. కేసీఆర్ కు ఏఐసీసీ వ ర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ కు పీసీసీ చీఫ్, హరీశ్ రావుకు (AICC Working President, PCC Chief to KTR, Harish Rao to Harish Rao) మంత్రి పదవి ఇవ్వనుంది. తెలంగాణ నుంచి కవి తను రాజ్యసభకు పంపినా ఆశ్చ ర్యం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేసిన కాసేపటికే బండి సంజయ్ ఒక ప్రక టన విడుదల చేశారు. బీజేపీలో బీ ఆర్ఎస్ విలీనం కానుందని, ఒప్పం దంలో భాగంగానే కవితకు బెయిల్ రానుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యా ఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిం చారు. కవితకు బెయిల్ ఇవ్వాలా, వద్దా అనేది న్యాయస్థానం పరి ధిలోని అంశం. కవిత బెయిల్ కు, బీజేపీకి (bjp)ఏం సంబంధం ఆమ్ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే మనీష్ తివారీ కి బెయిల్ వచ్చిందా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి పదవి లో కొనసాగుతూ రాజకీయ లబ్ధి (Political gain) కోసం గౌరవ న్యాయస్థానాలపై బురద చల్లడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించా రు. బీఆర్ఎ సది ముగిసిన అధ్యా యమని, ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని స్పష్టం చేశారు. బీఆ ర్ఎసను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోందని, పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మె ల్యేలను చేర్చుకుంటోందని ఆరో పించారు. గతంలోనూ పొత్తు పెట్టు కొని, మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర ఆ రెండు పార్టీలకు ఉందని గుర్తు చేశారు. కాళేశ్వరంలో అవి నీతి, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ సహా బీఆ ర్ఎస్ నేతలను జైలుకు పంపే అవ కాశం ఉన్నా, కాంగ్రెస్ కాపాడు తోందని ఆరోపించారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు “నువ్వు కొట్టినట్లు చేయ్ నేను ఏడ్చినట్లు చేస్తా” అన్నట్టుగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలకు (To CM Revanth Reddy and Congress leaders) దమ్ముంటే కాళేశ్వరం సహా అనేక అంశాల్లో వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్ ను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. కాగా, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి (Prime Minister Atal Bihari Vajpayee)వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి వద్ద బండి సంజయ్ నివాళులర్పించారు. వాజ్పేయి జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.