Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bangladesh Bhavan: బంగ్లా పీఠం పై నోబెల్ గ్రహీత ప్రభుత్వాధినేతగా యూనస్

–సుదీర్ఘ చర్చల అనంతరం అధ్యక్ష కార్యాలయం ప్రకటన
–బంగ్లాదేశ్ భవన్‌లో అధ్యక్షుడు ష హబుద్దీన్‌తో ఆరుగంటల పాటు వి ద్యార్థులు, త్రివిధ దళాధిపతుల విస్తృత చర్చలు
–నిర్బంధంలోని మాజీ ప్రధాని ఖలీ దా జియా విడుదల
–దేశవ్యాప్తంగా హత్యలు లూటీల తో అలజడి, పోలీస్‌స్టేషన్లకూ నిప్పు పెట్టిన దుండగులు
–బంగ్లాలో 19వేల మంది భారతీ యులున్నారని అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి జై శంకర్‌ వెల్లడి
–బంగ్లా పరిణామాలపై అనేక అను మానాలపై అనేకానేక విశ్లేషణలు

Bangladesh Bhavan: ప్రజా దీవెన, బంగ్లాదేశ్: బంగ్లాదేశ్‌ (Bangladesh )లో రాజకీయ సంక్షోభానికి తాజాగా తెరపడింది. విద్యార్థుల ఆందోళన లతో అట్టుడికిన బంగ్లాదేశ్ ప్రస్తుతా నికి శాంతించింది. ఆ దేశంలో అనే కానేక పరిణామాల నేపధ్యంలో తాత్కాలిక కొత్త ప్రభుత్వం (New Govt) ఏర్పా టుపై నెలకొన్న ఉత్కంఠకు తెరప డింది. ఆ దేశ తాత్కాలిక ప్రభు త్వాధినేతగా నోబెల్‌ అవార్డు గ్ర హీత మహమ్మద్‌ యూనస్‌ను దేశాధ్యక్షుడు మహమ్మద్‌ షహబు ద్దీన్‌ ఉత్కంఠ నడుమ ప్రకటించా రు. తన అధికార నివాసం బంగభవ న్‌లో విద్యార్థి సంఘాల నేతలు, త్రివిధ దళాధిపతులతో సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ మే రకు నిర్ణయం వెల్లడించారు. అధ్య క్షుడి ప్రకటనను ఆయన కార్యదర్శి జోనాల్‌ అబేదిన్‌ (Jonal Abedin)ఓ ప్రకటన చేశా రు. వివిధ పక్షాలు, రాజకీయ పార్టీ లతో చర్చించాక తాత్కాలిక ప్రభు త్వంలో మిగిలిన సభ్యుల పేర్లను ఖరారు చేస్తామని పేర్కొన్నారు. దీంతో ఎట్టకేలకు విద్యార్థి సంఘా లు తామనుకున్నట్లు ప్రభుత్వం మార్పు కు సంబంధించి పంతం నెగ్గించుకున్నట్లైంది.

దేశ వ్యాప్తంగా చెలరేగిన హింస… మరోవైపు దేశవ్యాప్తంగా ఆందోళనకారులు ఉధృతంగా హిం సకు పాల్పడ్డట్లు వెల్లడైంది. చాలా చోట్ల హత్యలు, లూటీలు జరిగిన సందర్భంలో పోలీస్‌స్టేషన్ల కు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హిందువుల, అవామీ లీగ్‌ (Hindus, Awami League)నేతలే లక్ష్యంగా దాడులు జరిగాయి. జైళ్ల ను బద్ధలు చేయడంతో ఖైదీలు పరారయ్యారు.

సైన్యం రంగప్రవేశంతో (Enter the army) ఉత్కంఠ… మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుపై మంగళవారం ఉదయం నుంచి సందిగ్దత నెలకొంది. ప్రజలు ఎన్నుకోని వారికి ఒక్క నిమిషం కూడా అధికారం ఇవ్వొద్దు, అలా చేస్తే బంగ్లాదేశ్‌ మరో పాకిస్థాన్‌ అవుతుందని హసీనా కుమారుడు నజీబ్‌ వజీద్‌ జాయ్‌ ముందే హెచ్చ రించారు. విద్యార్థి సంఘాల సమ న్వయ కర్త నహీద్‌ ఇస్లాం కూడా మధ్యంతర పౌర ప్రభుత్వానికే ఆ మోదం తెలుపుతామని భీష్మిం చారు. ఆర్మీ పాలనను అంగీకరించే ది లేదని తేల్చిచెప్పారు. నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృ త్వంలో సర్కారు ఉండాలని పేర్కొ న్నారు. యూనస్‌ కూడా ఎంతో త్యాగం చేసిన విద్యార్థుల కోసం తాను ప్రభుత్వాన్ని నడిపేందుకు సిద్ధమేనని ప్రకటన చేశారు. అయి తే ఆర్మీ చీఫ్‌ వకార్‌– ఉజ్‌– జమా మాత్రం సైనిక పాలన వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ పరిణామాల మధ్య బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి విద్యార్థి సంఘాల నాయ కులు, త్రివిధ దళాల అధిపతులతో తన అధికారిక నివాసo లో సుదీర్ఘం గా చర్చలు జరిపారు. ఈ చర్చలు జరుగుతుండగానే రాత్రి 7.40 గంట ల సమయంలో ఆర్మీ చీఫ్‌ సహా త్రి విధ దళాధిపతులు బంగభవన్‌ చేరుకొని చర్చల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి వరకు గంటగం టకూ బంగభవన్‌ వెలుపల ఆర్మీ మోహరింపు పెరుగుతూ వచ్చింది. దీంతో ఉత్కంఠ నెలకొంది. చివరకు అర్ధరాత్రి 12 గంటల సమయంలో తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా యూనస్‌ ఉంటారంటూ అధ్యక్ష కా ర్యాలయం నుంచి ప్రకటన వెలు వడడంతో ఉత్కంఠ వీడింది.

బీఎన్‌పీ చైర్‌పర్సన్‌ ఖలీదా (BNP Chairperson Khaleda) విడుదల బీఎన్‌పీ చైర్‌పర్సన్‌ ఖలీదా జియా నిర్బంధం నుంచి విడుదలయ్యారు. సోమవారం రాత్రే ఆమె విడుదలకు అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఆమె 2018 ఫిబ్రవరి 8 నుంచి రెండేళ్ల పాటు జైలు జీవితం గడుపుతుండగా ఆమెకు అవినీతి కేసుల్లో 13 ఏళ్ల జైలు శిక్ష పడి 20 20 మార్చి 25న ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా ఆమె విడుదలయ్యారు. ఆ తర్వాత హోంఅరెస్టులో ఉన్నారు. మాజీ సైనికాధికారి, బ్రిగేడియర్‌ జనరల్‌ అబ్దుల్లా–ఉల్‌–అమన్‌ అజ్మీ, సుప్రీంకోర్టు న్యాయవాది అహ్మద్‌–బిన్‌–ఖాసీం(అర్మాన్‌) జైలు నుంచి విడుదలయ్యారు. అబ్దుల్లా–ఉల్‌–అమన్‌కు 1971 నేరాలకు వ్యతిరేకంగా మరణ శిక్ష పడింది. దాంతో ఎనిమిదేళ్ల క్రితం ఆయనను విధుల నుంచి తొలగిం చారు.

షేక్‌ హసీనా (Sheikh Hasina) రాజీనామా తర్వాత దొమ్మీలు చేసే గుంపులు ఆందోళనకారుల్లో కలిసిపోయి.. రాత్రి 7.30 గంటల నుంచి అర్ధరా త్రంతా దేశవ్యాప్తంగా హత్యలు, లూటీలు చేశాయి. సినీనటుడు శాంటోఖాన్‌ మొదలు అవామీ లీగ్‌ పార్టీకి చెందిన జిల్లా, తాలూకా నేతల దాకా పలువురు హత్యకు గురయ్యారు. వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. పోలీస్‌స్టేషన్లలోనూ లూటీ చేసి, కంప్యూటర్లు, ఏసీలు, తుపాకీ లను దోచుకున్నారు. చివరకు పోలీ సు వాహనాల విడిభాగాలను కూ డా వదిలిపెట్టలేదని బంగ్లాదేశీ పత్రికలు కథనాలను ప్రచురించా యి. ఢాకాలోని సావర్‌లో జరిగిన హింసలో 31 మంది చనిపోయారు. కాక్స్‌బజార్‌, ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు, సిల్వర్‌సైన్‌ తదితర ప్రాంతాల్లో దుకాణాలు, హోటళ్లు, ఏటీఎం కేంద్రాలు లూటీకి గురయ్యాయి. ఈ ప్రాంతాల్లో జరిగిన హింసలో ఇద్దరు బీఎన్‌పీ నేతలు సహా 14 మంది మరణించారు. లాల్‌మొనిర్హాట్‌లో అవామీ లీగ్‌ నేత సుమోన్‌ఖాన్‌ ఇంటిని తగులబెట్టగా.. ఆరుగురు కుటుంబ సభ్యులు సజీవదహనమ య్యారు. జస్సార్‌లోని అవామీ నేత షాహిన్‌ చక్కల్దర్‌కు చెందిన 14 అంతస్తుల హోటల్‌ జబీర్‌ ఇంట ర్నేషనల్‌’కు నిప్పు పెట్టిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరుకుందని అధికారులు తెలిపారు. కోటా ఆం దోళనలు ప్రారంభమైనప్పటి నుంచి 440 మరణాలు నమోదైనట్లు అధి కారులు తెలిపారు.

రెండు జైళ్లపై (jail) దాడి.. లూటీ.. ఖైదీల పరార్‌ సోమవారం జరిగిన ఆందోళనల్లో రెండు జైళ్లు ధ్వంసమ య్యాయి. వాటిల్లోని కరడుగట్టిన ఖైదీలు పరార్‌ అయ్యారు. ఆందోళ నకారులు జైళ్లలోనూ దోపిడీకి పాల్పడ్డారు. షేర్పూర్‌లో ఉన్న జిల్లా జైలు గేట్లను బద్ధలు కొట్టిన సుమా రు 10 వేల మంది ఆందోళనకా రులు లోనికి దూసుకెళ్లారు. ఈ క్రమంలో యావజ్జీవ శిక్ష అనుభవి స్తున్న 10 మంది కరడుగట్టిన ఖైదీ లతో పాటు 500 మందికి పైగా ఖైదీ లు పారిపోయారు. సత్ఖిరా జిల్లా జైలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ 596 మంది ఖైదీలు పారిపోవడం గమనార్హం.