Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bar Association : కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా లక్ష్మీనారాయణ రెడ్డి.

Bar Association : ప్రజా దీవేన, కోదాడ: కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి తో పాటు కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపాధ్యక్షుడిగా ఉయ్యాల నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా రామిశెట్టి రామకృష్ణ, జాయింట్ సెక్రెటరీ ఎండి నయీమ్, లైబ్రరీ సెక్రటరీ, షేక్ కరీముల్లా, ట్రెజరర్ కోడూరి వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ బండారు రమేష్ బాబు, లేడీ రిప్రజెంటివ్ ధనలక్ష్మి, ఈసీ మెంబర్లు ఎన్ కృష్ణమూర్తి, వెంకటాచలం, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు, హుస్సేన్, నవీన్ కుమార్, కే మురళి లతో ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువపత్రాలను అందజేశారు.

అనంతరం నూతన వర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు శాలువా పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కేఎల్ఎన్ ప్రసాద్, మాజీ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి, సుధాకర్ రెడ్డి, నాలం రాజన్న, కందుల కోటేశ్వరరావు, షేక్ బషీర్, వంటి పులి వెంకటేష్, గట్ల నరసింహారావు, రామిరెడ్డి,గాలి శ్రీనివాస్ నాయుడు, ఈదుల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.