Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bar Council of India: లా కోర్సులు చదవాలంటే క్రిమినల్‌ బ్యాగ్‌గ్రౌండ్‌ తనిఖీ తప్పనిసరి.. లేదంటే

Bar Council of India: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (Bar Council of India)(బీసీఐ) తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.న్యాయ వాద వృత్తిలో పారదర్శకత, నైతిక ప్రమాణాలను పెంపొందించాలనే లక్ష్యంతో అనేక కొత్త నియంత్రణ చర్యలను తీసుకొచ్చింది. న్యాయ కళాశాలలు, విశ్వ విద్యాలయాల తో సహా అన్ని లీగల్ ఎడ్యుకేషన్ కేంద్రాలకు (CLEs) వర్తిస్తాయని ప్రకటించింది. న్యాయ విద్య, ఉద్యో గాల్లో చేరే వారికి తప్పనిసరిగా క్రిమినల్ బ్యాగ్‌ గ్రౌండ్‌ చెక్‌ చేయా లని బీసీఐ స్పష్టం చేసింది. న్యాయ విద్య కోర్సుల్లో అభ్యర్థులకు మా ర్కుల మెమో, పట్టా ఇచ్చే ముందు వారిపూర్వాపరాలను పరిశీలించా లని, నేరచరిత్ర ఉంటే తమ అను మతి పొందిన తర్వాతే పట్టా ఇవ్వాలనే కఠిన నిబంధన విధించింది. ఈ మేరకు దేశంలో న్యాయవిద్య అందించే విశ్వ విద్యాలయాలు, కళాశాలలకు ఆదేశాలు జారీచేసింది.

లా కోర్సు లు (Law Courses)అభ్యసించే విద్యార్థులకు నేర చరిత్ర ఉండరాదని, అందుకే క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌సిస్టమ్‌ (సీబీసీఎస్‌)ను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. మార్కుల ధ్రువపత్రాలు, డిగ్రీ పట్టాలు (Certificates of marks, degrees) జారీచేసే ముందు విద్యార్థుల నేరచరిత్రను తప్పని సరిగా పరిగణనలోకి తీసుకోవా లని, ప్రస్తుత ఎఫ్‌ఐఆర్, నేరంపై కేసు, శిక్ష తదితర వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఒకవేళ నేరచరిత్ర ఉంటే వివరాలను బీసీఐకి పంపించి, వారి నుంచి అనుమతి వచ్చాకే విద్యార్థులకు పట్టాలు అందించాలని పేర్కొంది. ఆయా నిబంధనలపై విద్యార్థులంతా హామీపత్రం కూడా సమర్పించాలంది. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే వ్యక్తులు క్లీన్ క్రిమినల్ రికార్డును కలిగి ఉండేలనే లక్ష్యంతో ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు పేర్కొంది.