–వచ్చే వారం రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ప్రారంభం
–ఆవాస గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంలో నాణ్యత పాటించాలి
–బడ్జెట్ సమీక్ష సమావేశంలో డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పం చాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
Batti Vikramaka: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ర్టంలోని గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Batti Vikramaka) మల్లు పంచాయతీ రాజ్ శాఖ అధికారులను కోరారు. శనివారం ఆయన పంచాయతీరాజ్ శాఖ (Panchayat Raj department)మంత్రి సీతక్కతో కలిసి సచివా లయంలో బడ్జెట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ యువత ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడు తున్నారు, వాళ్లను అలా వదిలేస్తే సమాజం ఇబ్బంది పడుతుందని వివరించారు. ఫీజు రియంబర్స్మెంట్ (fees reimbursement) పథకం అందు బాటులోకి రావడంతో వేలాదిమంది బీటెక్ పూర్తి చేసి, స్కిల్స్ లేక గ్రామా ల్లోనే ఉండిపోతున్నారని, ఆర్థికంగా ఉన్నవారు, తోడ్పాటు అందిన వా రు మాత్రం విదేశాల్లో స్థిరపడుతు న్నారని వివరించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసా గుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను హైదరాబాద్ కి పరిమితం చే యకుండా, మొదట పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని ఉపాధి కల్పన, మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చారు, వారు ప్రస్తుతం ఏం చేస్తు న్నారని, వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని సాఫ్ట్ వేర్ కంపెనీ (software companies) లతో అనుసంధానం చేసుకొని ఉపాధి కల్పించే అంశంపై పెట్టాలని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఉచితంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు రాబోయే వారం రోజుల్లోనే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. పోటీ పరీక్షల కోచింగ్ (competitive exams)కు నిపుణులైన వారితో ఉచితంగా గ్రామీణ యువతకు శిక్షణ ఇప్పించనున్నట్టు వివరించారు. నాలుగు నెలల్లోనే ఈ నాలెడ్ సెంటర్ల నిర్మాణాలు సైతం పూర్తి చేస్తామన్నారు.
ఉపాధి హామీ పథకం కింద చెరువుల్లో పూ డికతీత పనులు చేపట్టారు, రైతులు ఉచితంగా ఆ పూడిక మట్టిని పొలాలకు తరలించుకున్నారు, అయినా అవి పక్కకు పెట్టి గత పది ఏళ్లలో మిషన్ భగీరథ పేరిట 25 వేల కోట్లు ఖర్చు చేయడంపై అధికారులను ఆరా తీశారు. ఉపాధి హామీలోని పూడికతీత పనులను విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.ఆవాస గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలను సంతృప్త స్థాయిలో పూర్తి చేసేందుకు చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని పూర్తిస్థాయిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. వాటిని పరిశీలించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. కేంద్ర బడ్జెట్ (Central budget)చూసి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు నిధులు మలుచుకునే ప్రయత్నం చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. గత ఐదు సంవత్సరాల కాలంలో మ్యాచింగ్ గ్రాంట్స్ వినియోగించి కేంద్ర నిధులను సాధించుకునే అంశంలో పూర్తిగా నిర్లక్ష్యం చెప్పారు. ఈసారి ఆ పొరపాటు జరగవద్దని తెలిపారు. స్వీపర్ల వేతనాలు పెండింగ్లో ఉంటే వాటికి సంబంధించిన వివరాలు వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం పనితీరుపై ఈనెల 15వ తేదీ వరకు నివేదిక ఇవ్వాలని కోరారు. ఆ నివేదికను అందరు ఎమ్మెల్యేలకు అందజేసి ఇంటింటికి నీరు అందుతున్న విషయాన్ని నిర్ధారించుకోవాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఆదాయం సాధించి అప్పు చెల్లిస్తామని 30 వేల కోట్లు రుణం తీసుకొచ్చారు, కానీ ఆదాయం సాధించడం, అప్పు చెల్లించడంలో కార్పొరేషన్ పూర్తిగా విఫలమైందని డిప్యూటీ సీఎం అన్నారు. కార్పొరేషన్ విఫలం కావడం మూలంగా ప్రభుత్వమే ఆ అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అసలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీటిని ఎంత శాతం మేరకు వినియోగిస్తున్నారు అనే అంశాన్ని సర్వేలో చేర్చాలని ఆదేశించారు. 60 శాతం మంది మాత్రమే మిషన్ భగీరథ నీటిని వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. 30 వేల కోట్లు ఖర్చు చేసి పూర్తిస్థాయిలో ఈ పథకాన్ని వినియోగించుకోకపోతే అర్థం లేదని డిప్యూటీ సీఎం అన్నారు. మిషన్ భగీరథ నీటి నాణ్యత, ఆరోగ్యం తదితర అంశాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి చైతన్యం చేయాలని అధికారులను కోరారు. మిషన్ భగీరథ నీటిని వినియోగించుకునే అంశం గ్రామ సభల్లో ఒక ఎజెండాగా చేర్చాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తనియా, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి హరిత, పంచాయతీరాజ్ శాఖ అధికారులు దివ్య దేవరాజన్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.