ప్రతిపక్షాల విచిన్నానికి కెసిఆర్ కుట్ర
ఖమ్మంలో మీడియా సమావేశంలో సి ఎల్ పి నేత బట్టి విక్రమార్క
ప్రజా దీవెన/ ఖమ్మం :బీజేపీకి సహకరించే రీతిలో సీఎం కేసీఆర్ కాంగ్రెసేతర ప్రతిపక్షాల కూటమి విచ్చిన్నానికి కుట్ర చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజేపికి వ్యతిరేకంగా పాట్నా సమావేశానికి హాజరైన సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ను హైదరాబాద్ కు పిలిపించుకొని కేసీఆర్ చర్చించడం కాంగ్రెసేతర ప్రతిపక్షాల ఐక్యత విచ్చిన్నానికి చేస్తున్న కుట్రకు నిదర్శనమని ఆరోపించారు.
బీజేపీకి మేలు చేసే విధంగా బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందన్నారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చెప్పినట్లుగా ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తుందన్నారు. పొరపాటున ప్రజలు బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు.
కాళేశ్వరం ద్వారా అదనంంగా ఒక్క ఎకరానికైన కేసీఆర్ ప్రభుత్వం నీరు ఇవ్వలేదన్నారు. కాలువలకు నీళ్లు ఇవ్వకుండా 48లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామంటు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. చివరకు కాగ్ కూడ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిందని, చెప్పిన లెక్కలకు, ఖర్చులకు పొతన లేదన్నారు. వేల కోట్లు గోదావరి లో వృధాగా పోయాయయన్నారు. ప్రాణహిత చేవెళ్లతో 27వేల కోట్లతోనే ఏడున్నర న్నర లక్షల ఎకరాలకు అదనంగా నీరు పారేదన్నారు.ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇందిరా సాగర్ ద్వార 1500కోట్లు ఖర్చు పెట్టి ఉంటే 4లక్షల ఎకరాలకు నీరు వచ్చేదన్నారు. 1500కోట్ల వ్యయాన్ని 25వేల కోట్ల కు పెంచి ఒక్క ఎకరాకు నీరివ్వలేదన్నారు. అంతా దోపడి తప్ప నీళ్లు ఇచ్చింది లేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు, భూములు, పోడు భూములు సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయని, సంబంధిత పూర్తి సమచారంతో వాటిపై మునుముందు మాట్లాడుతానన్నారు.పెండింగ్ ప్రాజెక్టులను సందర్శించి ప్రజలకు వాస్తవాలు తెలియచెప్పేందుకు పార్టీ పరంగా పర్యటన కార్యక్రమాలు నిర్ణయించామన్నారు. రాజకీయాలుగాని, పాలన గాని ప్రజల కోసమే ఉండాలి తప్ప పాలకుల కోసం కాదన్నారు.ప్రపంచంలో వస్తున్న అభివృద్ధికి అనుగుణంగా మన సమాజం ముందుకు పోవాలే తప్ప మధ్యయుగాల నాటి ఆలోచన విధానాన్ని, ఫ్యూడల్ మనస్తత్వాన్ని వెనక్కి తీసుకెళ్లకుండా శాస్త్రీయ విధానంతో ముందుకెళ్లాలన్నారు. దురదృస్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం గడీల సంస్కృతిని పునర్ నిర్మాణం చేస్తుందన్నారు. ఖమ్మం జనగర్జన సభ రాష్ట్రంలో అధికారంలో రాబోతున్నామన్న సంకేతాన్ని ప్రజలకు అందించడంలో విజయవంతమైందన్నారు.