–సీఎం తక్షణమే అఖిలపక్షంతో రా ష్ట్రపతితో భేటీ కావాలి
–సర్పంచ్ ఎన్నికలలో గెలిచింది బీ సీలే పార్టీలు కాదు
–బీసీ వాదాన్ని తక్కువ చేసిచూపిం చేందుకు అన్ని పార్టీల ప్రయత్నం
–బీసీలకు నిరాశ మిగిల్చిన పార్ల మెంట్ సమావేశాలు
–త్వరలోనే తెలంగాణ లో బీసీ ల రథయాత్ర చేపడుతాo
–బీసీ జేఏసి రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
BC Associations : ప్రజా దీవెన, హైదరాబాద్: బీసీ రిజ ర్వేషన్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వనికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తెలంగాణ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌ హుపది ముర్ముని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్ష0తో తక్షణమే కలిసి రాష్ట్ర అసెంబ్లీలో చే సిన బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమో దించాలని కోరాలని బీసీ జేఏసీ చై ర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాం డ్ చేశారు. శుక్రవారం హైదరాబాదు లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ జే ఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ అ ధ్యక్షతన బీసీ జేఏసీ సమావేశం జ రిగింది. ఈ సమావేశానికి బీసీ జేఏ సీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ము ఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
21 రోజులు శీతాకాల పార్లమెంటు సమావేశాలు జరిగిన 21 రోజులలో 21 నిమిషాలు కూడా పార్లమెంటు లో బీసీ రిజర్వేషన్లపై చర్చించ లేద ని, బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటు లో చర్చించాలని పట్టు పట్టాల్సిన రాహుల్ గాంధీ మౌనం వహించాడ ని, బీసీల ఆకాంక్షలను గౌరవించి బీ సీ బిల్లును ఆమోదించాల్సిన ప్రధా ని నరేంద్ర మోడీ విదేశీ టూర్ లతో కాలం వెళ్లదీశాడని ఆయన ఆరోపిం చారు.పార్లమెంటు సమావేశాలు జ రుగుతున్న సందర్భంలో మూడు రో జులు దిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ బీసీ రిజర్వేషన్ కేంద్రం పైన ఒత్తిడి పెంచడానికి అఖిలప క్షంతో ప్రధానినీ కలిసే ప్రయత్నం చే యలేదని, చివరికి కాంగ్రెస్ అధిష్టా న పెద్దలను ఒప్పించి పార్లమెంటు లో బీసీ రిజర్వేషన్లు అంశం చర్చకు వచ్చేలా కనీసం ప్రయత్నం చేయ క పోవడం చాలా బాధాకరమన్నారు.
సర్పంచ్ ఎన్నికలలో రాష్ట్ర ప్రభు త్వం బీసీ రిజర్వేషన్ లను 17 శా తం కి తగ్గించి అన్యాయం చేయాల నీ ప్రయత్నించినప్పటికీ ఈ ఎన్ని క లలో బీసీలు తమ రాజకీయ చైత న్యంతో రిజర్వేషన్ తో సహా జనర ల్ స్థానాలలో కూడా బరిలో ఉండి 51 శాతం గెలిచారని, సర్పంచ్ ఎ న్నికలు పార్టీల గురుతుల మీద జరి గినవి కావని, బీసీ వాదంతోనే ఈ ఎన్నికలు జరిగాయని, జూబ్లీహిల్స్ ఎన్నికలలో మొదలైన బీసీ వాదం సర్పంచ్ ఎన్నికల వరకు రాజకీయ ప్రభంజనం సృష్టించిందని ఆయన తెలిపారు.
బీసీ వాదం ఎక్కడ బలపడిందని చె పితే రేపటి భవిష్యత్తు లో బీసీలకు రాజకీయ అధికారం లభిస్తుందని కుట్రతో సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, బిజెపి రామచంద్ర రావులు తమ గె లుపు అంటే తమ గెలుపు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని, స ర్పంచ్ ఎన్నికల్లో ముమ్మాటికి ఇది బీసీల గెలుపని వ్యాఖ్యానించారు..
నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటా మని ప్రకటించడాన్ని తాము తీవ్రం గా వ్యతిరేకిస్తున్నామని, బిజెపి శా సనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, తక్షణమే ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలని డిమాం డ్ చేస్తున్నాడని, దీనికి కాంగ్రెస్ ప్ర భుత్వం వత్తాసు పలుకుతుందని ఆయన అన్నారు, 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎ న్నికలకు వెళతామంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక మూడిన ట్లేనని ఆయన హెచ్చరించారు.
*బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా మడత వెంకట్ నియమకం*
బీసీ ఉద్యమాలలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఖమ్మం జిల్లా ఇల్లం దు కు చెందిన మడత వెంకట్ గౌడ్ ను బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా, ఉ మ్మడి ఖమ్మం జిల్లా బీసీ జేఏసీ ఇ న్చార్జిగా నియమిస్తూ బీసీ జేఏసీ చై ర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటిం చారు. మేరకు నియామక పత్రాన్ని శ్రీనివాస్ గౌడ్ వెంకట్ గౌడ్ కు అంద జేశారు, ఈ సందర్భంగా మడత వెంకట్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని, రాష్ట్రవ్యా ప్తంగా బీసీ రిజర్వేషన్లపై జరుగుతు న్న ఉద్యమానికి ఖమ్మం జిల్లా ఊ తమిచ్చేలా బీసీ జేఏసీ నిర్మాణాన్ని చేపడతానని మడత వెంకట్ గౌడ్ వెల్లడించారు.
నాకు జేఏసీ కన్వీనర్ గా పదవి బా ధ్యతలు అప్పగించిన చైర్మన్ జజు ల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ స మావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ వి క్రమ్ గౌడ్, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఈ నిరంజన్, జేఏసీ నేతలు కౌల జగ న్నాథం, జాజుల లింగంగౌడ్, తార కేశ్వరీ, ఉదయ్ నేత, గజ్జల సత్యo గౌడ్, శివమ్మ, ఇంద్రం రజక, హరి తి లక్ సింగ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
