BC leader Linga Goud: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ప్రా దాన్యత గల మంత్రిత్వ శాఖలు కేటాయించాలని టిపిసీసీ అధ్యక్షు లు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి విజ్ఞప్తి చేశారు బీసీ నేత లింగంగౌడ్. ఇటీవల నియమించిన సమాచార కమిషనర్లలో ఒక్క బీసీకీ కూడా అవకాశం కల్పించలేదని సమాచార కమిషనర్ సభ్యులుగా బీసీలను ని యమించి న్యాయం చేయాలని అలాగే బీసీలకు ప్రాధాన్యత గల మంత్రిత్వ శాఖలు కేటాయించాలని న్యూ ఎంఎల్ఏ క్వార్టర్స్ లో టిపి సీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి విజ్ఞప్తి చేసినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా లింగంగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రధాన కమిషనర్ మరియు ఐదుగురు కమిషనర్ సభ్యులలో ఒక్క బీసీ కూడా లేక పోవడం చాలా బాధాకరమని అన్నారు. బీసీలకు కీలకమైన ప్రా ధాన్యత గల మంత్రిత్వ శాఖ లు,బడ్జెట్ ఎక్కువ ఉన్న, పరిపా లన విధమైన శాఖలు ఇవ్వాలని టిపిసిసి మహేష్ గౌడ్ గారిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు లిం గంగౌడ్ తెలిపారు.