–ఆగస్టు 7న గోవాలో జరిగే జాతీ య ఓబీసీ మహాసభను జయప్ర దం చేయండి
–మహాసభ పోస్టర్ లను ఆవిష్క రించిన ఈటల, అసదుద్దీన్, వద్ది రాజు రవిచంద్ర, జాజుల శ్రీనివాస్ గౌడ్
BC Unity : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ని బీసీలంతా రాజకీయలకు అతీ తంగా ఐక్యం కావలసిన అవసరం ఎంతైనా ఉందని, ఆగస్టు 7న గో వాలో జరిగే జాతీయ ఓబీసీ మహా సభను జయప్రదం చేయడం ద్వా రా బీసీల ఐక్యతను దేశానికి చాటి చెప్పాలని బిజెపి నేత ఈటల రా జేందర్, ఎంఐఎం అధ్యక్షులు అస దుద్దీన్ ఓవైసీ, బిఆర్ఎస్ ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, పిలుపునిచ్చారు
ఆదివారం హైదరాబాదులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య క్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వ ర్యంలో ఆగస్టు 7న గోవాలో జరిగే 10వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ బిజెపి లోక్ సభ సభ్యులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఒవైసీ, బి ఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర లను బీసీ ప్రతిని ధులతో కలిసి వారితో మహాసభల వాల్ పోస్టర్ ను ఆవిష్కరింప చేశా రు. అనంతరం ఈటల ఇంటి వద్ద మహాసభలకు హాజరుకావాలని ఈటలకు వారి ఇంటి వద్ద, అలాగే అసదుద్దీన్ ఓవైసీకి దారుసలెంలో, ఎంపీ ఒద్దిరాజు రవిచంద్ర కు వారి నివాసంలో మహాసభలకు అతి థులుగా హాజరుకావాలని వారికి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆహ్వాన ప త్రికలను ఈ సందర్భంగా అందజే శారు.
అనంతరం వారు మాట్లాడుతూ దే శవ్యాప్తంగా బీసీలకు మంచి రోజు లు రానున్నాయని, బీసీల చైతన్యం కోసం నిరంతరం బీసీ సంఘాల చే స్తున్న కృషి అభినందనీయమన్నా రు. ఈ చైతన్యాన్ని ఇదే విధంగా ముందుకు కొనసాగించి బీసీలు తా ము కోల్పోతున్న హక్కులు సాధిం చుకోవాలని, జనాభా దామాషా ప్ర కారం అన్ని రంగాల్లో తమ వాటాను సాధించుకోవడం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అందర్నీ కలు పుకొని ముందుకు కొనసాగాలని వారు సూచించారు.
ఆగస్టు 7న గోవా రాష్ట్రంలోని డా క్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడి యంలో జరిగే జాతీయ పదవమ హాసభలకు దేశం నలుమూలల నుండి హాజరై బీసీల ఐక్యతను చా టాలని, ఓ బి సి మహాసభలకు తా ము కూడా హాజరు అవుతామని వారు వెల్లడించారు. పోస్టర్ ఆవి ష్కరణ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, మహాత్మ జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వా క అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సం ఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, జాజుల లింగం గౌడ్,
పాలకూరి కిరణ్, నాగరాజు గౌడ్, గ ణం నరసింహ, ఇంద్రం రజక, పవన్ సాయి గౌడ్, బండి గారి భరత్, తది తరులు పాల్గొన్నారు.