Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sridhar Babu : త్రీ ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధన లో భాగస్వాములవ్యoడి

–పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ లో అపారఅవకాశాలు
–18 నెలల్లో కొత్తగా రూ.3.2 లక్షల కోట్ల పెట్టబడులు
–యూఏఈ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపు

Minister Sridhar Babu  : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాల నేదే మా ప్రభుత్వ సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో పాలు పంచుకోవా లని యూఏఈ పారిశ్రామికవేత్తల ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. గురువారం హెచ్ఐసీసీలో యూ ఏఈ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తం గా “ఇన్వెస్టోపియా గ్లోబల్” పేరిట నిర్వహించిన అంతర్జాతీయ పెట్టు బడుల సదస్సును ఆయన లాంఛ నంగా ప్రారంభించారు.

‘భౌగోళికంగా చిన్నదైనా, ఆశయా లు, ఆచరణలో మాత్రం తెలంగాణ చాలా పెద్దది. స్వల్ప కాలంలోనే ఫీ నిక్స్ పక్షిలా ఎదిగి ఇతర రాష్ట్రాల కు అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శం గా నిలిచింది. 2024–25లో జీఎ స్‌డీపీలో 8.2 శాతం వృద్ధి నమోదైం ది. ఇది జాతీయ సగటు(7.6%) కం టే ఎక్కువ. దేశ జీడీపీలో తెలంగా ణ వాటా 5 శాతానికి పైగా ఉందని వివరించారు. ‘రాష్ట్రంలో డ్రై పోర్ట్‌ లు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కు లు, పారిశ్రామిక కారిడార్ల విస్తరణ కు ప్రణాళికలు రూపొందించాం. నె ట్-జీరో పారిశ్రామిక పార్కులు, ఈ వీ జోన్లు, గ్రీన్ లాజిస్టిక్స్ హబ్‌లు, రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్), మెట్రో ఫేజ్ – 2 తదితరాలు పారి శ్రామికాభివృద్ధికి మరింత ప్రోత్సా హం ఇవ్వనున్నాయన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో అభి వృద్ధి చేయబోతున్న ఫ్యూచర్ సిటీ ఫిన్‌టెక్, క్లైమేట్-టెక్, స్మార్ట్ మొబిలి టీ ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రం గా మారబోతోంది. డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీ సీ), ఏఐ ల్యాబ్‌లు, ఏరోస్పేస్ క్లస్టర్ల లో వేగవంతమైన వృద్ధి నమోదవు తోందని పేర్కొన్నారు. ‘ఈ18 నెల ల్లో తెలంగాణ కొత్తగా రూ.3.2 లక్ష ల కోట్లకు పైగా పెట్టుబడులను ఆక ర్షించింది. 2024–25 ఆర్థిక సంవ త్సరంలో యూఏఈకి తెలంగాణ ఎగుమతులు 2.5 రెట్లు పెరిగాయ ని, ఫార్మా, ఏరోస్పేస్, డిజిటల్ సేవ లు, ఫుడ్ ప్రాసెసింగ్ కీలక పాత్ర పో షించాయని తెలిపారు. ఇప్పటికే యూఏఈకి చెందిన లులు గ్రూప్, డీపీ వరల్డ్, నాఫ్కో వంటి యూఏఐ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయని తెలిపారు.

‘ఇది ఒక పెట్టుబడి సదస్సు మాత్ర మే కాదు. పాత స్నేహితుల కలయి క, భవిష్యత్తుకు ఒక లాంచ్‌ప్యాడ్. యూఏఈ లాగే, తెలంగాణ కూడా సమయం, నమ్మకం, పరివర్తనకు విలువ ఇస్తుంది. ఇక్కడ ఏఐ, ఎమ ర్జింగ్ టెక్నాలజీస్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధ నం, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, ట్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆ గ్రో ఎగుమతులు, ఏరోస్పేస్, డిఫె న్స్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ మొబిలిటీ, పర్యాటకం, వెల్‌ నెస్, మెడికల్ తదితర రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేం దుకు ముందుకు రావాలని ఈ వే దిక ద్వారా మరోసారి యూఏఈ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తు న్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో యూఏఈ మి నిస్టర్ ఆఫ్ ఎకానమీ, టూరిజం అ బ్దుల్లా బిన్ తాక్ అల్ మర్రి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, టీజీఐఐసీ ఎండీ కె.శశాంక, అండర్ సెక్రటరీ ఆఫ్ ది యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ మహ్మద్ అల్వాహీ, యూఏ ఐ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ వాలిద్ హరేబ్ అల్ ఫలాహి, ఇన్వెస్టోపియా సీఈవో డా.జీన్ ఫారెస్ తదితరులు పాల్గొ న్నారు.