Bhagat Singh : ప్రజా దీవేన, కోదాడ:రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన యువ కెరటం భగత్ సింగ్ అని అయన ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అన్నారు పట్టణంలోని స్థానిక ఖమ్మం ఎక్స్ రోడ్ భగత్ సింగ్ సెంటర్లో సిపిఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులపై తిరుగుబాటు చేసి 23 ఏళ్ల అతి చిన్న వయసులోనే ఉరికొయ్యను ముద్దాడాడు 1931 మార్చి 23 రాత్రి 7:30 గంటలకి భగత్ సింగ్ తో పాటు సుఖదేవ్ రాజు గురువులను హుస్సేన్ సవాల్ చేల్లో బ్రిటీష్ పాలకులు ఉరి తీశారు . ఉరి ఎదురుగా కనిపిస్తూన్న వారు అధైర్య పడలేదని చిరునవ్వుతోనే మృత్యును కౌగిలించుకొని దేశ స్వతంత్రం కోసం తమ పాణాలను అర్పించారని,తుది శ్వాస వరకు భారతీయ సమాజంలో పెరుగుతున్న మతతత్వ స్వభావాన్ని విమర్శించిన నాస్తికవాది భగత్ సింగ్ అని వారన్నారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదం సాగిస్తున్న అరాచకత్వానికి వ్యతిరేకంగా 1929లో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీపై బతికేశ్వర్ దత్తుతో కలిసి భగత్ సింగ్ బాంబు విసిరారు పారిపోకుండా అక్కడే నిలబడి సామ్రాజ్యవాదం నశించాలి ఇంకిలాల్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారని వారన్నారు ఈ సందర్భంగా కమ్యూనిస్టులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించారు కార్మికులను రైతాంగాన్ని విద్యార్థి యువకులను ఉద్యమంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారని ఈ స్ఫూర్తి నందు కొన్ని రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలలో యువతీ యువకులు మహిళలు ముందుకు రావాలని వారన్నారు ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం కోదాడ పట్టణ కార్యదర్శి మిట్ట గనుపుల ముత్యాలు. టౌన్ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, కర్ణకోటి నవీన్, నక్క గోపి, గొర్రె ముచ్చు మరి అన్న, మార్కెట్ యూనియన్ అధ్యక్షులు ఏడుకొండలు, టైలరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ జానీ, సామిల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఇటికాల శేషయ్య, గంటేల శ్రీను భూమా శ్రీను, వెంకటరత్నం, తదితరులు జోహార్లు అర్పించారు