Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: బ్యాంకర్లకు సామాజిక బాధ్యత ఉండాలి

–పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్
–బ్యాంకర్స్ కు సానుకూల దృక్పథం లేకపోతే అభివృద్ధి అసాధ్యం
–నిరుపేద వర్గాలకు రుణాలిచ్చేందు కు బ్యాంకర్లు ముందుకు రావాలి
–రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయి
–వ్యవసాయ రంగానికి సంబంధించి చెల్లింపుల్లో పెండింగ్ లు ఉండవు
–సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమలకు అధిక రుణాలు ఇవ్వాలి
–బలహీన వర్గాలకు విరివిగా రుణా లిస్తేనే సమగ్రాభివృద్ధి చెందుతుంది
–రాష్ట్రంలో మిగులు విద్యుత్తు ఉన్నందున రెప్పపాటు కరెంటు కోతలు కూడా లేవు
–బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైదరాబాద్: బ్యాంకర్లకు (bankers) సామాజిక, మనవీయ కోణం ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మల్లు అన్నారు. బుధవారం ఆయన హైదరాబాదులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) తో కలిసి బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ యువ రాష్ట్రం, బాగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని తెలిపారు. దేశవాసులకే కాదు, యావత్ ప్రపంచానికి తెలంగాణ పెట్టుబడుల స్వర్గధామం అన్నారు. రాజధానిలో ORR , ఎయిర్ పోర్టు, చౌకగా మానవ వనరులు, మంచి వాతావరణం, ఫ్రెండ్లీ గవర్నమెంట్, కాస్మోపాలిటన్ సిటీ, భాషా సమస్య లేదన్నారు. బ్యాకర్లకు పాజిటివ్ దృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదన్నారు. కేవలం బడా పారిశ్రామిక వేత్తలకే కాకుండా నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. సామాజిక ఎజెండానే ఇందిరమ్మ (Indiramma) రాజ్యం లక్ష్యం అన్నారు. తెలంగాణలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల తో పాటు, కోర్ ఇండస్ట్రీ, soft ware, hard ware ఇతర క్లస్టర్లు అభివృద్ధి చెందాయి అన్నారు. RRR నిర్మాణంతో తెలంగాణ రాష్ట్ర రూపు రేఖలు మారిపోనున్నాయన్నారు. అతిపెద్ద రీజినల్ రింగ్ రోడ్డు తో తెలంగాణ రాష్ట్రంలో అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ఇలా మూడు ప్రాంతాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

లండన్ (London)లో తెమ్స్ నదిని అభివృద్ధి చేసినట్టుగా హైదరాబాదులో మూసి పరివాహక ప్రాంతం అభివృద్ధికి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పరివాహక ప్రాంతంలో వ్యాపారం విస్తరించనున్నదని వివరించారు. ఓవైపు వ్యవసాయ రంగం, మరోవైపు పారిశ్రామిక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతుందన్నారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం (state government) సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. రైతు భరోసా ద్వారా అన్నదాతలకు పెట్టుబడి సాయం సమకూరుస్తున్నామన్నారు. 24 గంటలపాటు ఉచితంగా (free) విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు కొన్ని పంటలకు బోనస్ కూడా అందిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి బాగా పెరిగింది తద్వారా రాష్ట్రంలో ఇథనాల్ పెట్రోలియం (Ethanol Petroleum) ఉత్పత్తులకు కేంద్రం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, ప్రోత్సాహకాలకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నామని రూపాయి కూడా పెండింగ్లో పెట్టలేదన్నారు. ఇటీవల ఆయిల్ ఫామ్ రైతులకు 100 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయిల్ ఫామ్ సాగు తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు.

MSME సూక్ష్మ, పెద్ద తరహా పరిశ్రమలకు బ్యాంకర్లు పెద్ద మొత్తంలో రుణాలు (loans) అందించాలి ప్రోత్సహించాలి అన్నారు. రాష్ట్రంలో, దేశంలో అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది ఈ రంగమే అని వివరించారు. బలహీన వర్గాలకు రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమాగ్రాభివృద్ధి సాధిస్తుందన్నారు. సబ్సిడీ (subsidy) పథకాలకు సంబంధించి ప్రభుత్వం తన వాటాను విడుదల చేస్తున్న బ్యాంకర్లు సహకరించడం లేదని… సాధారణంగా బ్యాంకర్లు మంజూరులు ఇచ్చినప్పటికీ సబ్సిడీ మొత్తం విడుదలలో జాప్యం జరుగుతుంది కానీ రాష్ట్రంలో ENDUKU వ్యతిరేకంగా పరిస్థితి కనిపిస్తుందన్నారు. రుణాల విషయంలో ప్రైవేట్ బ్యాంకులు లక్ష్యాలు సాధిస్తున్నప్పటికీ, జాతీయ బ్యాంకులు వెనుకంజ లో ఉంటున్నాయి, జాతీయ బ్యాంకుల బ్రాంచీల సంఖ్య తగ్గడం సరే అయింది కాదన్నారు. జాతీయ, గ్రామీణ బ్యాంకులు విస్తృతంగా బ్రాండ్ ఇమేజ్ ని ప్రచారం చేసుకోవాలన్నారు. పోల్చి చూస్తే ఈ మధ్యకాలంలో జనం ఎక్కువగా ప్రైవేటు బ్యాంకుల వైపు వెళుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు.

మహిళా సంఘాల అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ (Telangana State Govt) ప్రధాన లక్ష్యం అన్నారు. ఇందుకుగాను ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు ఐదేళ్లపాటు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించే కార్యక్రమం చేపట్టిందన్నారు. ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్తు అందుబాటులో ఉంది. రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా (Free electricity supply) చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చిన ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు వివరించారు. రుణాలు పెంచడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది, రాష్ట్రంలో పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలిపారు.