Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhatti Vikramarka: తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు

— శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఆశించాను
–శ్రీశైలం హైడల్ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి సమీక్ష
–తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవు
–శ్రీశైలంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ప్రజా దీవెన, శ్రీశైలం: ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్న వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, బ్రమరాంబిక అమ్మవారి (Srisaila Mallikarjuna, Bramarambika Ammavari) ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మల్లు తెలిపారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యుల తో పాటు, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, మెగా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకు న్నారు. అనంతరం మీడియాతో (MEDIA) మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, ఋతు పవనాలు బలంగా వీచా లని, పంటలు సమృద్ధిగా పండాలని ఆ దేవుని ప్రార్థించాను అని తెలి పారు. కరువు కాటకాలు అనేవి లేకుండా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఋతుపవనాలు రాకముందే శ్రీశైలం హైడల్ ప్రాజెక్టును (Srisailam hydel project)సమీక్షించి తద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన చర్యలు చేపట్టడమే తన పర్యటన ఉద్దేశం అన్నారు. నాటి కాంగ్రెస్ పెద్దలు ముందుచూపుతో నిర్మించిన బహుళార్థక సార్ధక ప్రాజెక్టుతో మన జీవితాల్లో వెలుగులు నిండాయి. అమర జీవులకు నివాళులు అన్నారు. శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు ద్వారా అత్యధిక స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవు, 2029-30 వరకు కావలసిన విద్యుత్తు తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.