–రూ.2,91,159 కోట్లతో సంపూర్ణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క
–రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు, మూలధన వ్యయం రూ.33, 487 కోట్లు, ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులకు ప్రతిపాదన
— హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేసి తీరుతాం
–రైతులకు రుణమాఫీ చేస్తామ న్నాం, చేసి చూపించాం
–రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకూ త్వరలోనే మాఫీ
–అదే క్రమంలో త్వరలో రైతు భరోసా కింద రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తాం
–జాబ్ క్యాలెండర్ విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నాం
–మహిళల కోసం మరో కొత్త పథకం ప్రవేశ పెడుతున్నాం
–బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క వరాల జల్లు
Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను డిప్యూ టీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)రూ.2,91,159 కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్‌గా (budget) ప్రవేశపెట్టా రు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా మూ లధన వ్యయం రూ.33,487 కోట్లు గా ప్రతిపాదించారు. ఈ ఏడాది రూ.57,112 కోట్ల అప్పులు తీసుకో వాలని ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటా యించారు (Funds have been allocated). ఈ క్రమంలో భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికి అభివృద్ధిని ఆపలేద న్నారు. డిసెంబర్ నుంచి పథకాల కోసం రూ.34,579 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నా మని పేర్కొన్నారు. గతంలో పేపర్ లీకులు, నిరుద్యోగులకు ఉద్యో గాలు రాని పరిస్థితి ఏర్పడిందని అం టూ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామక పత్రాలు అందించామని చెప్పారు.
త్వరలో జాబ్ క్యాలెండర్ (Job Calendar) ప్రకటిస్తామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు, ఆరో గ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క పేర్కొన్నారు. ఇక రుణ మాఫీపై తప్పుడు ప్రచారం చేస్తు న్నారని విపక్షాలపై భట్టి మండిప డ్డారు. రుణమాఫీకి రూ.31వేల కోట్లు సమీకరిస్తున్నామని, త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చాము, కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని అంటూ ఇప్పటికే లక్ష వరకు రుణం ఉన్న 11.34 లక్షల రైతులకు రుణమాఫీ (Loan waiver for farmers) చేశామని ప్రకటించారు. రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వర లో రుణమాఫీ అవుతుందన్నారు.
రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలన్నది తమ సంకల్పమన్నారు. త్వరలో భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు అందిస్తామన్నారు.రైతులు పండించే వరి సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని, ప్రధాని ఫసల్ బీమా యోజనలో చేరబోతు న్నామ ని మొత్తం వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు ఖర్చు చేస్తున్నా మని చెప్పారు. ఇక ప్రజా వాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యే క ఐఏఎస్ అధికారిని కూడా నియ మించామని తెలిపారు.గాంధీ, ఇందిరమ్మ, రాజీవ్ (Gandhi, Indiramma, Rajiv)ల ఆశయస్ఫూర్తితో గ్రామీణ స్వరాజ్యానికి కృషి చేస్తామన్నారు. ‘మిషన్ భగీరథ’లో జరిగిన అవకతవకల వల్ల ఇప్పటికీ చాలా గ్రామాల్లో తాగునీటి వసతి లేదన్నారు ఉప ముఖ్యమంత్రి. తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా పరిష్కరించామని పేర్కొన్నారు. బాలబాలికలకు పౌష్టికాహారాన్ని అందించటంతో పాటు, విద్యను కూడా అందించాలనే సంకల్పంతో అంగన్ వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా మార్చాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేశామని, పాఠశాలల నిర్వహణను అప్పగిస్తామని చెప్పారు.
ధరణికి మరమ్మతులు…
గత ప్రభుత్వం కుట్రపూరితంగా ‘ధరణి’ని (Dharani’)చేసిందని విమర్శించారు. లోపభూయిష్టమైన ధరణి వల్ల చాలా మందికి రైతుబంధు, రైతు బీమాలను కూడా చాలామంది రైతులు అందుకోలేకపోయారన్నా రు. ధరణి పోర్టల్ వల్ల వచ్చే సమ స్యల పరిష్కారానికి ఒక కమిటీని వేసామన్నారు. కమిటీ అధ్యయనం పూర్తయ్యాక సరైన నిర్ణయం తీసు కుంటామని చెప్పారు.
నకిలీ విత్తనాలను అరికడ తాం
ఇక వ్యవసాయానికి తీరని నష్టం కలిగిస్తున్న నకిలీ విత్తనాలను (Fake seeds) అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎప్పటికప్పుడు విత్తనాల షాపుల్లో తనిఖీలు చేస్తున్నామన్నారు. అలా గే అక్రమాలు జరిపే వారిపై పీడీ యాక్ట్ ను కూడా ప్రయోగిస్తున్నా మన్నారు.
ఉచితంతో రూ.2,351 కోట్లు ఆదా…
ఇక మహాలక్ష్మీ ఉచిత బస్సు పథ కంపై (Mahalakshmi Free Bus Route)మాట్లాడుతూ 68.60 కోట్ల ప్రయాణాలను తెలంగాణ మహి ళలు ఉపయోగించుకున్నారు. దీని ద్వారా తెలంగాణ మహిళలకు రూ.2,351 కోట్లు ఆదా అయ్యింద న్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల తెలంగాణ ఆర్టీసీకి ఎంతో మేలు జరుగుతున్నదని భట్టి చెప్పారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ‘మహాలక్ష్మీ’ పథకం కింద ఫ్రీ బస్సు జర్నీస్కీమ్ ఇంప్లిమెంట్ చేసి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే అన్నారు.
మహిళల కోసం మరో సరికొత్త పథకం…
మహిళలకు (womans)మరో పథకాన్ని ప్రభు త్వం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటిం చారు భట్టి. 63లక్షల మంది మహి ళలను విజయవంతమైన వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్ద డంలో భాగంగా ‘ఇందిరా మహిళా శక్తి పథకం’ రూపకల్పన చేసినట్లు చెప్పారు. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాం కులతో అనుసంధానం అనే మార్గా ల ద్వారా రూ.లక్ష కోట్ల ఆర్థిక సా యాన్ని అందిస్తామని వెల్లడిం చారు.ఈ పథకం ద్వారా మహిళ లకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి, నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్ లలో మెలకువలు పెంపొందించే విధంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5వేల గ్రామీణ సంఘాలకు ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ధి చేకూరే విధంగా కార్యచరణ చేపట్టి, రాబోయే ఐదేళ్లో 25వేల సంస్థలకు విస్తరించడానికి కృషి చేస్తామని చెప్పారు.డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు భట్టి అసెంబ్లీలో ప్రకటించారు. ధాన్యం సేకరణ కేంద్రాలను పెంచామని, మరింత ఆధునీకరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇక రేషన్ బియ్యం అక్ర మాలకు పాల్పడిన రైసు మిల్లర్లపై (ric emillers) కఠిన చర్యలు తీసుకున్నామ న్నారు.