–గ్రీన్ ఎనర్జీ, మిగులు విద్యుత్ కు ప్రణాళికలు సిద్ధం
–పరిశ్రమలకు విద్యుత్తు, నీటి సమస్య రానివ్వం
–ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం
–ప్రతి ఏటా 50వేల కోట్ల విలువైన మందులు ఎగుమతి చేస్తున్నాం
–హైటెక్స్ లో 73వ ఫార్మా కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Bhatti Vikramarka: ప్రజా దీవెన, హైదరాబాద్: విదేశా లకు ఎగుమతి అయ్యే ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం ఎగుమ తులు తెలంగాణ రాష్ట్రం నుంచే అవుతున్నాయంటే ఈ అంశం మన అందరికీ గర్వకారణం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. శుక్రవారం హైటెక్స్ లో జరిగిన 73వ ఫార్మా కాంగ్రెస్ (congress)లో ఆయన ముఖ్యఅతి థిగా హాజరై ప్రసంగించారు. ఫార్మసిస్టులు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు వెన్నుముక లాంటి వారు అని తెలిపారు. రోగి భద్రత, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఫార్మా రంగానికి కీలకపాత్ర అన్నారు. అత్యధిక నాణ్యతతో తక్కువ ధరకు జనరిక్ మెడిసిన్ను ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తూ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని తెలిపారు. కోవిడ్ వంటి మహమ్మారి సమయంలో అసమానమైన చురుకుదనం ప్రదర్శించి, అవిశ్రాంతంగా శ్రమించారని ఫార్మసిస్టుల (Pharmacists)సేవలను ఆయన కొనియాడారు.
ఫార్మా పరిశ్రమకు (pharma industry) రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుంది అన్నారు. హైదరాబాద్ బిర్యానీకి ప్రసిద్ధి ఇప్పుడు బిర్యానీతోపాటు బయో ఫార్మా ఉత్పత్తులకు ప్రసిద్ధిగాంచిందని తెలిపారు. అందరికీ ఆరోగ్యం అందుబాటులో తీసుకొస్తే దృఢమైన ప్రపంచాన్ని నిర్మించగలమన్నారు. బౌల్ అఫ్ ఫార్మ గా హైదరాబాద్ స్థిరపడిందన్నారు. సుగంధ ద్రవ్యాలను సరఫరా చేసే స్థాయి నుంచి మానవ జీవితాలను కాపాడే మందుల సరఫరా దశకు తెలంగాణ రాష్ట్రం చేరుకుందన్నారు. ఫార్మా రంగంలో అనేక ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Govt)పారిశ్రామిక రంగంతో స్నేహపూర్వక వైఖరిని అవలంబిస్తుందన్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యత తమది అన్నారు. ORR, RRR ల మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్తు, నీటి కొరత ఉండదన్నారు. త్వరలో రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీని ఆచరణలో తీసుకురా అన్నట్టు వివరించారు. గ్రీన్ ఎనర్జీ, మిగులు విద్యుత్తు ఉండేలా కొత్త చట్టంలో చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఆరోగ్య సంరక్షణకు ఫార్మా పరిశ్రమ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఫార్మాసిస్టులు మాంత్రికుల లాంటివారు , వారు చిన్న చిన్న మాత్రలను ఆరోగ్యానికి శక్తివంతమైన ఏజెంట్లుగా (agensts) వినియోగిస్తారని చమత్కరించారు.