–తొలగిన కోర్టుస్టే తో దరఖాస్తులకు త్వరలో మోక్షం
–రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమా చార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Minister Ponguleti Srinivas Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: భూభార తి చట్టం ద్వారా సాదాబైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తా మని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స మాచార పౌరసంబంధాల శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటిం చారు. సాదాబైనామాలపై ఉన్న స్టే ను రాష్ట్ర హైకోర్టు మగళవారం నా డు తొలగించిందని ఈ తీర్పు లక్ష లాది మంది పేద ప్రజల కలలను సాకారం చేస్తుందన్నారు.
సాదా బై నామాల విషయంలో గత ప్రభుత్వం పేద ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరించారని కానీ 2020 ఆర్ ఓ ఆర్ చట్టంలో ఈ దరఖాస్తుల పరి ష్కారానికి మార్గం చూపించలేదని విమర్శించారు. ఫలితంగా 9.26 లక్షల దరఖాస్తులు పరిష్కారం కా కుండా పోయాయని దీనిపై కొంత మంది హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు.
సాదా బైనామాల దరఖాస్తులను ప రిష్కరించి పేదలకు న్యాయం చే యాలన్న ఆలోచనతో తమ ప్రభు త్వం నిరంతరం హైకోర్టులో కేసుకు ముగింపు లభించేలా కృషి చేసింద న్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఈ సమస్యకు ప రిష్కారం చూపించాలన్న సంకల్పం తో తమ ప్రభుత్వం భూభారతి చ ట్టంలో స్పష్టమైన నిబంధనలను పొందుపరిచిందని తెలిపారు.
సాదా బైనామాల దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరి స్తామని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయడం జరిగిం దన్నారు. గత ప్రభుత్వం అక్రమంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిక ల్లో ఇచ్చిన హామీ మేరకు బంగాళా ఖాతంలో కలిపేశామని, దేశంలోని 18 రాష్ట్రాలలో అధ్యయనం చేసి భూభారతి -2025 చట్టాన్ని రూపొం దించామన్నారు.
రోల్ మోడల్‌గా నిలిచిన ఈ భూ భారతి చట్టం మేరకు రైతన్నల , ప్ర జల సమస్యలు పరిష్కరించేందుకు సదస్సులు నిర్వహించగా 8.60 ల క్షల దరఖాస్తులు వచ్చాయని తెలి పారు. ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపించే తమ ప్రభుత్వం కృత ని శ్చయంతో పని చేస్తుందని అన్నా రు.