Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 9:38 am Posted by : praja deveena

MP Chamala Kiran : బిగ్ బ్రేకింగ్, భువనగిరి ఎంపీ చా మల కిరణ్ సంచలన వ్యాఖ్య,ఫోన్ ట్యాపింగ్ తో ఎవరినీ ఎదగకుండా చేద్దామనుకున్నారు

MP Chamala Kiran : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు పరిణామాల పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీసీఎం కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలిచి న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆందోళనలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ద్వా రా ఎవరినీ ఎదగకుండా చేద్దామనే కుట్ర చేశారని ఎంపీ ఆరోపించారు. ఆదివారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడా రు.

ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీ ఆ ర్‌కు సిట్ నోటీసులు ఇస్తే తెలం గా ణ ఆత్మ గౌరవమoటూ లబోది బో మంటున్నారని గతంలో ముఖ్య మంత్రిగా ఉన్న కేసీఆ‌ర్‌కు తెలియ కుండా ఫోన్ ట్యాపింగ్ కోసం ఇజ్రా యిల్ నుంచి పరికరాలు కొనుగోలు చేస్తారా అని నిలదీశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లో సీసీ కెమెరా లు బంద్ చే సి పరికరాలు, ఫైల్స్ ధ్వంసం చేసి మూసీ నదిలో, వికా రాబాద్ అడవుల్లో పడేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో పింకీ లు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు చేరిపేసి ఇప్పుడు తెలంగాణ ఆత్మ గౌరవం గుర్తుకు వస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాం లో తెలంగాణ పౌర హక్కులు హ రించబడ్డాయని, ప్రతిపక్ష నాయకు లు, అధికారులు, సొంత బిడ్డ, అ ల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని విమ ర్శించారు. తెలంగాణలో అరాచక పాలన చేశారని కవిత చెప్పారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పేరులో తెలంగాణ అనే పదాన్ని తీసివేసి బీఆర్ఎస్ అని పెట్టినప్పుడు తెలం గాణ ఆత్మగౌరవం ఎక్కడికి పో యిందని ప్రశ్నల వర్షం కురిపించా రు. తెలంగాణ ప్రజలకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని కేసీఆర్ చెప్పారని, తెలంగాణ అ మరవీరులను విస్మరించినప్పుడు కేసీఆర్‌కు తెలంగాణ ఆత్మ గౌరవం గుర్తుకు రాలేదా అన్నారు.