Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bhuvaneshwari : టిడిపి కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై భువనేశ్వరి హర్షం

–ఇక కౌరవ సభ స్థానంలో గౌరవ సభ కొలువుదీరనుంద‌ని ట్వీట్

Bhuvaneshwari: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం పట్ల సీఎం చంద్రబాబు (chandra babu) సతీమణి నారా భువ నేశ్వరి (Bhuvaneshwari) హర్షం వ్యక్తం చేశారు. తాను కోరుకున్నట్టుగానే అద్భుతమైన ప్రజా తీర్పుతో ప్రజా పాలన ఆరంభ మైందని పేర్కొన్నారు. ప్రజలే సుప్రీం అని చాటి చెప్పిన తిరుగులేని తీ ర్పుతో ఇక కౌరవ సభ స్థానంలో గౌర వ సభ కొలువుదీద‌నుంద‌ని అన్నా రు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందన్న పూర్తి నమ్మకం నాకుంది అంటూ ట్విట్ (tweet) చేశారు. నాడు నిజం గెలవాలి కార్యక్రమం లో ప్రజల ఆవేదన చూశాను, బాధలు విన్నాను, ఇబ్బందులు తెలుసుకున్నాను. ఇవాళ రాష్ట్రం లో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచినంత సంతోషంలో ఉన్నారు, స్వేచ్ఛగామాట్లాడగలుగుతున్నారు, తమ అభిప్రాయాలను చెప్పగలుగు తున్నారు. నాడు తమకు జరిగిన అన్యాయాలను నిర్భయంగా ప్రస్తా విస్తూ, తాము అనుభవించిన క్షోభ పై గళం విప్పుతున్నారు. నాడు అ శాంతితో బతికిన ప్రజల మనసు లు నేడు తేలికపడ్డాయి.

మహిళ లు తమ రక్షణపై, తల్లులు తమ బిడ్డల భవిష్యత్తుపై ధైర్యంగా ఉ న్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఇది నా మనసు కు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇక ప్రజలకు అంతా మంచే జరుగు తుంది.కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు (chandra babu) గారి పాలనలో అమ రాతి రాజధానిగా మళ్లీ గర్వంగా నిలబడుతుంది. రాజధాని రైతుల పోరాటాలు ఫలించి వారి జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయి. చంద్ర బాబు (chandra babu) దీక్ష, పట్టుదలతో జీవనాడి పోలవరం ప్రాజెక్టు సవాళ్లను, వి ధ్వంసాన్ని అధిగమించి ముంద డుగు వేస్తుంది. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి మంచి చేయాలనే చంద్రబాబు గారి సంక ల్పం నెరవేరుతుంది. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన పార్టీ కార్యకర్తలకు గౌరవం దక్కుతుంది. అంటూ నారా భువనేశ్వరి తన ట్వీట్ లో పేర్కొన్నారు.