Praja Deveena
Newspaper Banner
Date of Publish : 31 October 2025, 8:26 am Posted by : praja deveena

Azharuddin Telangana Minister : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ 

Azharuddin Telangana Minister : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగా ణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా కొనసాగుతున్న మంత్రివర్గ విస్తరణ ముగిసింది. విస్తరణలో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యం లో తెరమీద కొచ్చిన అజారుద్దీన్ ఎ ట్టకేలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మహమ్మద్‌ అజారుద్దీన్‌ ప్రమాణ స్వీ కా రం చేశారు. శుక్రవారం మధ్యా హ్నం 12.15 గంటలకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగగా తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాలులో అజారుద్దీన్ చేత ప్రమాణ స్వీకా రం చేయించారు.రాజ్ భవన్ దర్బార్ హాల్‌ను ప్రోటోకాల్ అధికారు లు పరిశీలించారు. మంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమం నేపథ్యం లో సీటింగ్, తది తర అంశాలకు సంబంధించి అధికారులు ఏర్పా ట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు హాజరయ్యారు.

ఇదిలా ఉండగా అజారుద్దీన్ గత ఎ న్నికల్లో జూబ్లీహిల్స్ నియోజక వర్గం నుంచే పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమం లో ఎమ్మె ల్యే మాగంటి గోపినాథ్ మృతి త ర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అని వార్యం నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ తరఫున అజారు ద్దీనే జూబ్లీహిల్స్ నుంచి బరిలో దిగుతారంటూ విస్తృత స్థాయిలో ప్రచారం కొనసాగిoది. కానీ చివరకు అజారుద్దీన్‌ ను ఎమ్ఎల్‌సీ చే స్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా శుక్రవారం ఆ యన మంత్రిగా ప్ర మాణ స్వీకారం చేశారు కూడా అజారుద్దీన్‌కు కే టాయించే శాఖల పై న సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమా చారం.

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎ న్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అ మల్లో ఉంది. అలాంటిది అజారుద్దీ న్‌కు మంత్రి పదవి ఎలా కే టాయి స్తారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నాయి. కేవలం ఒక వర్గం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటా యించారని ఆ రోపిస్తూ బీజేపీ నేతలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యా దు చేశారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకారం అంశంపై అనేక అ నుమానాలు తెర మీదకు వచ్చాయి. కానీ చివరకు ఎలాంటి అవాం తరంలేకుండా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారం ముగించా రు.

అజారుద్దీన్ వ్యక్తిగత వివరాల విష యానికి వస్తే ఆయన 1963 ఫిబ్రవ రి 8న హైదరాబాద్‌లోనే జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్‌ సె యింట్స్‌ హై స్కూల్‌లో చదువుకున్నారు. నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశారు. తన మేనమామ జైనులాబుద్దీన్‌ స్ఫూర్తి తో క్రికెట్‌ దిశ గా అడుగులు వేశారు. తొలిసారి 1984లో అంతర్జాతీయ క్రికెట్‌లో రంగప్రవేశం చేసి తనకం టూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అలానే మొదటి 3 టెస్టుల్లోనూ సెంచరీలతో సంచలనం సృష్టించా రు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌ తీసు కు న్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చా రు. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్‌పా ర్టీలో చేరారు. అదే సంవత్సరం యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2018లో ఆయనను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన విషయం కూడా తెలిసిందే.

మరో ఇద్దరికీ కేబినెట్ హోదా.… ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌ రెడ్డి లకు కేబినెట్‌ హోదా దక్కింది. మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్‌ హో దాతో పదవులను కేటాయించింది. రాష్ట్రంలో మరో ఇద్దరు ఎమ్మె ల్యేలకు కేబినెట్‌ హోదా దక్కింది. మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్‌ హోదాతో పదవులను కేటాయించింది.

రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌రావు, ప్రభుత్వ సలహాదారుడిగా బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డిని నియమించారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యతను సు దర్శన్‌ రెడ్డికి అప్పగించారు. వీటిపై జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ఆయన సమన్వయం కానున్నారు.

ఇక అన్ని కేబినెట్‌ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆయ నకు ప్రవేశం కల్పించారు. ఈ మేరకు మంత్రులకు ఉండే సదు పాయాలన్నీ సుదర్శన్‌ రెడ్డికి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చే సింది. సచివాలయంలో ఆయనకు మంత్రి స్థాయి వసతులు అంద నున్నాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.