
–బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెం ట్ లో ఆమోదించండి
–బీసీ రిజర్వేషన్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలి
Justice Minister Virendra : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీ సీల ఆకాంక్షలను గౌరవించి, బీసీల కు విద్యా ఉద్యోగ రాజకీయ రం గా ల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచు తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చే సిన చట్టాన్ని ప్రస్తుతం జరిగే పార్ల మెంటు సమావేశాలలోనే ఆమో దించాలని బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర సామాజిక న్యాయ సాధికారి త మంత్రి వీరేంద్ర కుమార్ కు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు బిఆర్ఎస్ పార్ల మెంట్ సభ్యులు వద్దిరాజు రవిచం ద్ర ఆధ్వర్యంలో పార్లమెంటులోని కేంద్రమంత్రి కార్యాలయంలో బీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. గత రెండు రోజులుగా బీసీ జేఏసీ ఆధ్వ ర్యంలో ఢిల్లీలో ఆందోళన చేపట్టిన బీసీ జేఏసీ నేతలు బుధవారం కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ను కలిసి బీ సీ డిమాండ్లపై పది నిమిషాలు చ ర్చించారు. ఈ సందర్భంగా ఐదు డి మాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కేంద్రమంత్రికి అందజేశారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌ డ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో బీసీలు చేసిన పోరాట ఫలితం గా రాష్ట్ర ప్రభుత్వం డేడికిషన్ కమి షన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మొదటిసారి సమగ్ర కులగనన చే పట్టారని, తదుపరి బీసీ లకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శా తం రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ లో బిజెపి, టీఆర్ఎస్, సిపిఐ, ఎం ఐఎం టీజేఎస్ పార్టీల మద్దతుతో ఏ కగ్రీవంగా చట్టాన్ని ఆమోదించి ఢిల్లీ కి పంపించారని ఈ సందర్భంగా ఆ యన గుర్తు చేశారు.
బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు చెల్లదని న్యాయస్థానాలు అడ్డు ప డుతున్నాయని సుప్రీం కోర్టు తీర్పు దరిమిలా రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీలులేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వము తక్షణమే జోక్యం చే సుకొని రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చ ట్టాన్ని ఈ పార్లమెంటు సమావేశాల లోనే రాజ్యాంగాన్ని సవరించి 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఆయన కోరారు
బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యు లు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడు తూ తెలంగాణలో అత్యధిక శాతం బీసీ జనాభా ఉన్న విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో తీరని న్యాయం జరుగుతుందని అందుకే కాంగ్రెస్ ప్ర భుత్వం రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చ ట్టానికి టిఆర్ఎస్ పార్టీ కూడా మద్ద తు తెలిపిందని, అసెంబ్లీలో చేసిన చట్టం 8 నెలలు గడుస్తున్నప్పటికీ ఆమోదం పొందడం లేదని అందుకే ఈ పార్లమెంటు సమావేశాలలో బి ఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెం టు లో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టా మ ని తాము పెట్టిన ప్రైవేటు బిల్లుకు కూడా కేంద్ర ప్రభుత్వం మద్దతు తె లిపి బీసీ బిల్లు ఆమోదానికి కృషి చే యాలని ఆయన కేంద్ర మంత్రి కోరా రు.
*బీసీ బిల్లుపై ప్రధానితో చర్చి స్తా…* బిసి జేఏసీ నేతలు చెప్పిన డిమాండ్లను ఓపికగా విన్న కేంద్ర సా మాజిక న్యాయ సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ స్పందిస్తూ బీసీ రిజ ర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, ఇందిరాసహని కేసులో సుప్రీంకోర్టు తీర్పు సామాజిక రిజర్వేషన్లు 50 శాతం పరిమితి మించొద్దని తీర్పు ఇచ్చినందున కేంద్ర ప్రభుత్వం వివి ధ రాష్ట్రాల నుండి బీసీ రిజర్వేషన్లు పెంచాలని వచ్చిన విజ్ఞప్తులను నిషి తంగా పరిశీలిస్తున్నట్లు ఆయన వె ల్లడించారు. దేశంలో అందరికీ సమ న్యాయం జరగాలని తమ ప్రభుత్వ లక్ష్యమని అందుకే వచ్చే ఏడాది నుండి దేశ వ్యాప్తంగా జనగణలో కూడా కులగణనా చేపడుతున్నా మని ఆయన తెలిపారు
బీసీ రిజర్వేషన్ అంశాన్ని త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తా న ని ఆయన ఈ సందర్భంగా బీసీ నే తలకు హామీ ఇచ్చారు. కేంద్ర మం త్రి కలిసిన వారిలో మాజీ పార్లమెం ట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మ న్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ వి క్రం గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక సురేష్ తదితరులు పాల్గొన్నా రు.




